నా ప్రియ స్నేహితులారా, బైబిల్ నుండి నిర్గమకాండము 33:14వ వచనమును నేటి వాగ్దానముగా తీసుకొనబడినది. ఆ వచనము, "...నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను.''ఈ వచనము ఎంత ప్రాముఖ్యము అంటే, అనుదినము మనము దీనిని పొందుకుంటూ ఉండాలి. చాలామంది ఒక ఆటను ఆడుతూ ఉండేవారు. 'మీరు లేకుండా జీవించలేనిది ఏది' అని ప్రజలు అడిగే ఆ గేమ్ మీకు తెలుసా? కొంతమంది సెల్ ఫోన్ లేక చేతిలోని పర్సు, హ్యాండ్‌బ్యాగ్, టూత్ బ్రష్ అని చెబుతుంటారు. కానీ, వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని సన్నిధిలేకపోతే జీవించలేకపోవువారముగా ఉండాలి. అన్నిటికంటే అధికముగా దేవుని సన్నిధానము మాకు కావాలి అని చెప్పాలి. దేవుని సన్నిధానము మనకు ఉన్నప్పుడు, మనకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువు మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, దిగులు చెందకండి.
నా ప్రియులారా, ఈ విశ్రాంతి దేనిని సూచిస్తుంది? దీని అర్థం మన మనస్సులకు మరియు శరీరానికి సమాధానమును పొందుకుంటాము. అదేవిధంగానే, శరీరాన్ని, మానసిక విశ్వాసంగా అది సూచిస్తుంది. అంతమాత్రమే కాదు, మనము ఈ విశ్రాంతిని పొందుకున్నప్పుడు, ఇంకా అధికముగా ఫలభరితముగా ఉంటాము. దేవుని రాజ్యము కొరకు ఇంకా అధికముగా పని చేస్తుంటాము. ఇంకా అనేకులకు ఆశీర్వాదకరముగా మారతాము. ఈ విశ్రాంతితో కూడ మనము చక్కని నిర్ణయాలను తీసుకొనగలుగుతాము. మంచిని చెడును మధ్య వ్యత్యాసమును తెలుసుకుంటాము. అనేకులకు ఆశీర్వాదకారకముగా ఉంటాము.
నా ప్రియులారా, బైబిల్‌లో కీర్తనలు 1:3 వ వచనమును చదువుదాము. ఆ వచనములో, "అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.'' మా హాస్పిటల్‌లో ఒక సహోదరి జీవితములో నేను ఇది చూశాను. తన పేరు జాస్మిన్, తను ఒక నర్సు. తన జీవితములో తను అనేక శ్రమలను ఎదుర్కొన్నప్పటికిని, తను ఎల్లప్పుడు దేవుని సన్నిధానమును కలిగి ఉంటుంది. ఆమె మా ఐసియుకి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యత వహిస్తుండేది, వైద్యులమైన మాకు ఎటువంటి సందేహము ఉన్నను, మేము తన యొద్దకు వెళ్లి అడిగి తెలుసుకునేవాళ్లము. తనను చూస్తేనే ఎంతో సంతోషంగాను, సమాధానముగాను ఉండేది. నాకెప్పుడు ఐసియులో డ్యూటీ వచ్చినను, ఒక వారం రోజులు ముందుగానే, ఆ సహోదరికి ఫోన్ చేసి, నీవు వచ్చి నాకు సహాయము చేయాలి అని కోరుకునేదానను. అటువంటి దేవుని సన్నిధానమును తను కలిగి ఉండేది. తను ఏమి చేసినను వర్థిల్లుతుండేది. తన యందు తనతో పాటు దేవుని యొక్క సన్నిధానమును కలిగియుంచుట చేతనే, హాస్పిటల్‌లో అనేకులకు దీవెనకరముగా ఉండినది. నా ప్రియులారా, ఈ రోజు మీరు మీ పాఠశాలకు, కళశాలకు మరియు మీ పని స్థలమునకు వెళ్లుటకు ముందుగానే, 'ప్రభువా, నీవు మాతో కూడ రండి,' అని ప్రార్థన చేయండి. మీకు ఎప్పుడు సమయము దొరికినను, 'ప్రభువా నీ సన్నిధానము నాకు కావాలి' అని ప్రార్థించండి. మన ఫోన్‌లో బ్యాటరీ ఛార్జీ తగ్గిపోయినప్పుడల్లా, ఏవిధంగానైతే, ఛార్జింగ్ చేస్తామో, మీరు కూడ ప్రతిసారి ప్రభువు సన్నిధానముతో నింపబడినట్లయితే, ఆయన సన్నిధానము చేత అత్యంత శక్తివంతులుగా మీరు మార్చబడతారు. నా ప్రియులారా, ఈ రోజు దేవుని సన్నిధానముతో నింపబడుట కొరకై మనము ప్రార్థన చేద్దామా?ఈలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునట్లుగాను, ఆయన మీకు విశ్రాంతిని కలుగజేయును.కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసయ్యా, నీ బిడ్డలమైన మాపై నీ సన్నిధానము దిగివచ్చునట్లు చేయుము. ప్రభువా, ఈ నూతన దినములోనికి అడుగు పెడుతుండగా, మేము పనిచేయు స్థలమునకు లేక ఉద్యోగస్థలము, కళాశాలకు వెళ్లుచుండగా, ఇంటిలో మా పనిని ప్రారంభిస్తుండగా, ప్రభువా, నిత్యము మేము నీ సన్నిధానమును కలిగి ఉండునట్లుగా కృపను చూపుము. అనేక లక్షల మందికి మేము దీవెనకరముగా ఉండునట్లుగా కనికరమును చూపుము. దేవా, ప్రజలు మమ్మును చూచినప్పుడు, నీ సన్నిధానమును అనుభూతి చెందునట్లుగా కృపను అనుగ్రహించుము. మాలో ఉన్న నీ సన్నిధానము ఇతరుల పట్ల ప్రకాశించునట్లుగా చేయుము. దేవా, బలహీనులమైన మేము నీ సన్నిధి చేత నింపి, అత్యంత శక్తిమంతులమగునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, నీ సన్నిధితో మేము పొంగిపొర్లునట్లు చేయుము. ప్రభువా, నిరాశలో మేము నీ సన్నిధికి వచ్చునట్లు చేయుము. దేవా, మేము ఈ రోజును ప్రారంభించినప్పుడు, మాతో ఉండమని మేము నీ ఉనికిని ఆహ్వానిస్తున్నాము. మా దశలలో మేము చక్కగా నడుచునట్లుగా మమమ్ము నడిపించుము, నీ సమాధానముతో మమ్మును నింపుము. తద్వారా, మేము సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయుము. దేవా, నీవు మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించినట్లే, ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ నిత్య ప్రేమ మరియు సహాయమును మాకు అనుగ్రహించుమని మా యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.