Loading...
Dr. Paul Dhinakaran

మీ అవమానమునకు ప్రతిగా ఘనతనిచ్చే దేవుడు!

Dr. Paul Dhinakaran
26 Mar
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అవమానము పొందియున్న అదే స్థలములో ప్రభువు మీకు ఘనతను అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఎక్కువ కాలము వేచియుండుట ద్వారా మీ ఆత్మ అలసిపోయి యుండవచ్చును? మీరు వేచియున్న సమయములో మీరు ఎదుర్కొన్న అవమానాలన్నిటిని దేవుడు గుర్తుంచుకుంటాడు. ఆయన మీ శత్రువుల యొక్క అపహాస్యపు మాటలు మరియు వారి యొక్క చులకన చూపులను చూస్తున్నాడు, కాబట్టి, దేవుని యందున్న మీ నిరీక్షణను కోల్పోకండి, దేని నిమిత్తము మీరు నిరుత్సాహపడకుండ ఉన్నట్లయితే, దేవుడు మిమ్మల్ని ఇతరులకన్నా ఉన్నతముగా హెచ్చిస్తాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది'' (కీర్తనలు 23:5) అన్న వచనము ప్రకారము మీ అవమానమునకు ప్రతిగా దేవుడు మీకు రెండంతలుగా ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు బైబిల్ నుండి మీకు ఇచ్చిన వాగ్దానమును మీరు చూచినట్లయితే, " మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగముననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును '' (యెషయా 61:7) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ అవమానమునకు బదులుగా రెట్టింపు భాగమునకు కర్తలగునట్లుగా ప్రభువు మిమ్మల్ని హెచ్చిస్తాడు.

నా తండ్రికి ప్రభువు ప్రత్యక్షమై కారుణ్య విశ్వవిద్యాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మాకు రెండు పడక గదుల ఇల్లు మాత్రమే ఉండెను. అది కూడ అద్దె యిల్లు. దానితో కూడ ఒక పాత కారు కూడ ఉండేది. కానీ, ప్రభువు ' కారుణ్య విశ్వవిద్యాలయాన్ని నిర్మించమని ' చెప్పిన వెంటనే రుణం కోరుతూ బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు వెళ్లారు. ఋణము ఇచ్చుటకు కావలసిన పత్రాలు చూపించడానికి మావద్ద ఏమియు కూడ లేదు. కానీ, ' కారుణ్య విశ్వవిద్యాలయాన్ని నిర్మించమని యేసు ప్రభువు నాకు తెలియజేశాడు. నాకు లోన్ ఇవ్వండి ' అని మా నాన్నగారు విజ్ఞప్తి చేశారు. కానీ, ' మీరు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడానికి మీ వద్ద ఏ అర్హత కలదు? అని బ్యాంక్ అధికారులు మరియు విద్యా అధికారులు మా తండ్రిగారిని చూసి హేళనగా మాట్లాడారు. కానీ, మా నాన్న పట్టుదలతో ఋణం కొరకు వెదకుచున్న సమయంలో, నా చెల్లెలు ఏంజల్ ప్రమాదవశాత్తుగా మరణించెను. అప్పుడు కూడ ఆయన కారుణ్య విశ్వవిద్యాలం నిర్మించుట కొరకు ప్రయాసపడుచుండెను. ప్రభువు నీకు స్థలమును చూపించియున్నాడు, అయితే, అది ఎక్కడ ఉన్నదని మనకు తెలియదు. ఇంకను, మన యొద్ద డబ్బు కూడ లేదు. అయినను, ప్రభువు మనకు సెలవిచ్చిన ప్రకారము ఆయన మన కొరకు తప్పకుండా ఒక మార్గాన్ని తెరుస్తాడు. నేను వెళ్లి నీకు బయలుపరచినట్లుగానే, ఒక స్థలమును వెదకెదనని చెప్పి, ఊటీ మరియు కొడైకెనాల్ ఇంకను అనేక ప్రాంతాలకు వెళ్లారు. చివరికి, మేము పర్వతాలతో చుట్టుముట్టబడియున్న కోయంబత్తూర్ సమీపంలో ఉన్న సిరువాని అను ఒక ప్రదేశానికి వెళ్ళాము. ఆ స్థలమును చూచిన వెంటనే, నా తండ్రి, ' ఇదే ఆ స్థలం ' అని చెప్పారు. మేము లోన్ కొరకు ఎంతగానో వెదకుట చూసి, జాలిపడి ఒక బ్యాంకు మాకు మొదటిసారిగా ఋణం ఇచ్చుటకు ముందుకు వచ్చెను. ఆ ముళ్ల పొదలలో స్థలమును కొనడానికి, మా తాతగారు చెప్పులు ధరించి, మైదానంలో ఎంతో కష్టపడి నడిచారు. అక్కడ ఆ స్థలమును అమ్మడానికి ఎవరు కూడ ముందుకు రాలేదు. మీరెవరు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని ప్రజలు మమ్మల్ని వెంబడించారు. కానీ నేడు, అదే స్థలంలో ఇప్పుడు కారుణ్య విశ్వవిద్యాలయం, పాఠశాలలు మరియు ఆసుపత్రిని స్థాపించడానికి ప్రభువు 750 ఎకరాలగల భూమిని ఇచ్చాడు. వేలాది మంది పిల్లలు మరియు వారి ద్వారా తల్లిదండ్రులు, వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, మానసిక వికలాంగులు మరియు శారీరక వికలాంగులు ఆశీర్వదింపబడుచున్నారు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పొరుగు వారి నుండి మీరు అనుభవించుచున్న అవమానమును గురించి, దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, " ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను '' (జెఫన్యా 3:19) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇకపై అమానమును పొందరు. మీ పరిసర ప్రాంతాలలో అవమానము మరియు సిగ్గు మీరు ఇక ఎన్నటికిని అనుభవించరు. భయపడకండి,ఈ రోజు మీ అవమానము నుండి విడుదలను అనుగ్రహించుట మీరు చూచెదరు. " అందుకు ... భయపడకుడి, ... మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు '' (నిర్గమకాండము 14:13) అన్న వచనము ప్రకారము నేటి నుండి మీ అవమానము ఖ్యాతిగా మారుతుంది. మీరు ప్రజలకు ఖ్యాతి మరియు ఆశీర్వాదమునకు చిహ్నంగా మార్చబడెదరు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని నామమును ఆశ్రయముగా పొందుకొని, మీ నమ్మకాన్ని క్రీస్తు మీద ఉంచినట్లయితే, ఆయన మీ పక్షాన ఉన్నాడు. ధైర్యంగా ఉండండి.

నా ప్రియులారా, అవమానము, సిగ్గు నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితానికి ఎన్నడు అంతము కాదు. కానీ ఖ్యాతి, ఘనతయే మీకు ముగింపు. మీరు అన్నిటిలో విజయవంతులని గుర్తించుకొనండి. మీ కోసం ప్రాణము పెట్టిన ప్రేమగల రక్షకుని మీద మీరు నమ్మకము కలిగియున్నారా? మీ కొరకు సిలువపై ఆయన కార్చిన రక్తమును మీరు మరచిపోకూడదు. ఆయన మీ మొఱ్ఱలను వినకుండా ఉండుటకు ఆయన చెవిటి వాడు కాదు. మీరు ఆయన అనుగ్రహించిన వాగ్దానముల మీద విశ్వాసాన్ని ఉంచాలి. అంధకారపు లోయలు ఎన్నటికి నిలిచియుండవు. తప్పకుండా మీరు వెలుగును చూచెదరు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎంతో కాలము నుండి అవమానమును, సిగ్గును ఎదుర్కొనుచున్నారని చింతించుచున్నారా? కలవరపడకండి, పై చెప్పబడిన వాగ్దానము ప్రకారము, మీకు ఘనతనిచ్చే దేవునికి మీ జీవితాలను సమర్పించుకొని, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీరు అవమానము పొందిన అదే స్థలములో మీకు మంచి పేరును, ఖ్యాతిని మరియు ఘనతను అనుగ్రహించి మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.
Prayer:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

ప్రభువా, మేము మంచి పేరును ఖ్యాతిని పొందాలని నీవు మా కొరకు సిలువలో అవమానమును పొందినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. మా కొరకు నీ ప్రాణము పెట్టినందుకై నీకు స్తుతులు చెల్లించుచున్నాము. ఈ లోకములో బాధలు, శోధనల చేత తపించిపోయే మా జీవితాలను ఒక్కసారి చూడుము. దేవా, నీవు మా మీద కనికరపడి, మాకు కలుగు సకల విధములైన శోధనల నుండి మమ్మును విడిపించి, మా జీవితములో ఖ్యాతిని మంచి పేరును సంపాదించుకొనుటకు మాకు సహాయము చేయుము. మేము అవమానము పొందిన ప్రతి స్థలములలోను ఘనతను మరియు మంచి పేరును మాకు అనుగ్రహించుము. మా జీవితాలలో అలుముకొనియున్న అంధకారమును తొలగించి మమ్మును నీ వెలుగుతో నింపుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000