Loading...
Stella dhinakaran

దేవుడు ఇచ్చు రక్షణ మనకు సమీపముగా ఉన్నది!

Sis. Stella Dhinakaran
10 Dec
నా ప్రియులారా, నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షణను కలిగించుట కొరకే ఆయన ఈ లోకమునకు దిగివచ్చాడు. ఆయన అనుగ్రహించు రక్షణను పొందుకోవాలంటే, మనము ఏమి చేయాలి? అనగా, దేవునికి భయపడాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా నున్నది '' (కీర్తనలు 85:9) అన్న వచనము ప్రకారము ఆయన రక్షణ ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. " ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది '' (రోమా 1:17) అన్న వచనము ప్రకారము, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుదురు. ప్రభువుకు భయపడువారికి రక్షించే దేవుని హస్తము ఎల్లప్పుడు సమీపముగా ఉన్నదని విశ్వాసులు ఎరుగుదురు. మరియు పరిశుద్ధముగాను ఆయనను ఆరాధించు వారికి మనము వ్యక్తిగతంగాను మరియు ఆధ్యాత్మికంగా ఎటువంటి చిక్కులలో ఉన్నను, మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఆయన ప్రేమతో మనలను కౌగలించుకొని, తన యొద్దకు చేర్చుకుంటాడు. మనము శిక్షలో ఉన్నట్లయితే, మనకు ముందుగా ఉన్న ఆయన ఎల్లప్పుడు మనకు సమీపముగా ఉన్నాడు అనే మధురమైన సత్యము - మనము మారుమనస్సు పొంది, నూతనపరచబడుటకు, పరిశుద్ధతను పొందుకొనుటకు మనలను ప్రోత్సాహపరచుచున్నది. 

మన ప్రతి ఒక్కరి జీవితములో ప్రభువు శక్తి అనునది ఎంతో ప్రాణాధారమై యున్నది. ఈ శక్తి అనునది ప్రభువైన యేసుక్రీస్తు సువర్తమానము విని రక్షణ పొందుట ద్వారా వచ్చును. జక్కయ్య అను ఘోరపాపి, ఇటువంటి రక్షణను పొంది తన కుటుంబమంతటితో కలిసి ఈ రక్షణానందమును అనుభవించాడు. ఈలాగుననే ఆ దేవుని యొక్క దైవిక శక్తిని పొందిన తరువాత క్రూరుడైన సౌలు దేవుని సేవకుడైన పౌలుగా మార్చబడెను. ప్రియమైనవారలారా, మీరు ఇటువంటి దైవీక అనుభవములను పొందియున్నారా? అని ఈ దినమే మిమ్మును మీరు పరిశీలించుకొనండి. 

ఒకానొక కుటుంబము ఇటువంటి దైవీకమైన ఘనమైన దేవుని శక్తిని వారి జీవితములో పొందుకొనకుండా, తమ ఇరుగుపొరుగు వారిని ఎంతో కష్టపెట్టుచు ఉండిరి. ఇటువంటి సమయములో వారి బంధువులలో ఒకరు వారితో కూడ వారి ఇంటిలో ఒక గదిలో ఉంటూ, తన ఉద్యోగమునకు వెళ్లసాగెను. కానీ, ఈ సహోదరుడు దైవీకమైన అనుభవమును కలిగినవాడై ఆ కుటుంబములో చేరి, వారి కొరకును ప్రార్థించి, వారందరు దేవుని యొక్క శక్తిని పొందునట్లుగా చేసెను. అదియు గాక, దేవుని సువార్తను ఇరుగు పొరుగువారికి కూడ తెల్పెను. ఇటువంటి తరుణములో దేవుడు ఆ సహోదరుడిని ఎంతగానో వాడుకొని, అతని ద్వారా అనేకులకు రక్షణ కలుగజేసెను. మరి ముఖ్యముగా అంధకారంలో నివసించుచున్న ఆ కుటుంబము దేవుని యొక్క రక్షణ శక్తిని పొందుకొనిరి. వారు ఆయనలో ఆనందించునట్లుగా వారిని బలపరచి, వారి ప్రాంతములో ఒక ఆలయమును కట్టునట్లుగా వారిని మార్చివేసెను. 
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితమును కూడ ప్రభువుకు సంపూర్ణముగా సమర్పించుకొన్నట్లయితే, ఆయన మీకు రక్షణానందమును అనుగ్రహిస్తాడు. అప్పుడు మీరు ఆయన దృష్టిలో యోగ్యమైన క్రియలను చేయుచూ, ఆయన యందు భక్తిగల జీవితమును జీవిస్తారు. ఆలాగుననే, దేవుని ప్రేమకు సమీపముగా అనేకమందిని ఆకర్షిస్తారు. పైన చెప్పబడిన వ్యక్తివలె అనేక కుటుంబాలను క్రీస్తు అనుగ్రహించు రక్షణానందమును పొందుకొనునట్లుగా, వారిలో మార్పును కలుగజేసి, ఆయన యొద్దకు తీసుకొని వచ్చుటకు సహాయపడెదరు. ఆలాగుననే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అనేక కుటుంబాలను ఆయన ప్రేమను రుచి చూచుటకు లోనికి మార్చడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకొనును. ప్రభువు మీకు అనుగ్రహించిన రక్షణ అను వరము నిమిత్తము మీరు అనుదినము ప్రార్థించుచు మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
రక్షణానందమును అనుగ్రహించే మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నీవు మాకు ముందుగా వెళ్లి, మేము పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. ఓ గొప్ప దేవా, నీ రక్షణ అనునది నిజముగా ఎంతో మహిమాన్వితమైనదియు మరియు ఎంతో గొప్పవాడైయున్నందున మాకు నీ కృపను ప్రసాదించి, మా జీవితమును బలపరచి, మేము మా యొక్క విశ్వాసము ద్వారా ఇతురులను బలపరచుటకు సహాయమ చేయుము. ప్రభువా, అనేకులను నీ రక్షణానందములోనికి నడిపించుటకు అటువంటి గొప్ప వాంఛను మాలో దయచేయుము. మేము అనేకుల జీవితాలను నీ వైపు త్రిప్పుటకు నీవు మమ్మల్ని ఆయత్తపరచుమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000