Loading...
Evangeline Paul Dhinakaran

దేవుని పిలుపునకు తగిన బహుమానమును పొందండి!

Sis. Evangeline Paul Dhinakaran
09 Nov
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని పిలుపునకు లోబడి జీవించాలి. ఆయన పిలుపునకు లోబడినట్లయితే, తగిన బహుమానమును పొందుకొనగలము. బైబిల్లో చూడండి, " క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను '' ( ఫిలిప్పీయులకు 3:14) అన్న వచనము ప్రకారము అపొస్తలుడైన పౌలును యేసుక్రీస్తు పిలిచినప్పుడు, తనకున్న విశ్వాస కారణముగా, దేవుని అతడు స్థిరముగా పట్టుకున్నాడు. కనుకనే, దేవుడు అతని ద్వారా గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఆలాగుననే, దేవుడు ప్రతిఒక్కరికిని తన రాజ్యము కొరకు ఏదో ఒక పరిచర్య చేయాలని తన పిలుపునిస్తాడు. అదియుగాక, 9 ఆత్మీయ వరములను అనుగ్రహిస్తాడు. అయితే, మనకున్న శక్తిసామర్థ్యముల కొలది వాటిని బహుమతిగా అనుగ్రహిస్తాడు. కాబట్టి, దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటే, మన యెదుట ఉంచబడిన పందెములో గురి యొద్దకు విజయవంతముగా పరుగెత్తగలము. 

నేను పరిచర్య చేయుటకు మొదలు పెట్టినప్పుడు, ప్రారంభంలో చాలా మృధువుగా మాట్లాడేదానను. కనుక అక్కడకు కూడి వచ్చిన ప్రేక్షకులకు వినబడదని యేసు పిలుచుచున్నాడు సిబ్బంది, నేను మాట్లాడిన ప్రతిసారి మైక్రోఫోన్ ధ్వనిని పెంచేవారు. అయితే, నేను వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు, ఎంతో పెద్దగా ప్రార్థిస్తాను. ఒకసారి, నా సహోదరి నా యొద్దకు వచ్చి, " నీవు మాట్లాడుచున్నప్పుడు మృధువుగా మాట్లాడతావు, కానీ, ప్రార్థించే సమయములో గట్టిగా ఎలాగున ప్రార్థించుచున్నావు? '' అని అడిగింది. అప్పుడు నేను ఎంతో విచారంగా భావించాను. కానీ, దేవుని సన్నిధిలో, " ప్రభువా, నేను నా భర్త డాక్టర్. పాల్ దినకరన్ గారివలెను, మా తండ్రిగారైన స్వర్గీయులైన సహో. డి.జి.యస్. దినకరన్ గారివలెను మరియు మా తల్లిగారైన సహో. స్టెల్లా దినకరన్ గారి వలె బిగ్గరగా మాట్లాడాలి '' అని ప్రార్థించాను. ఆ సమయములో ఒక దంపతులు మా గృహమును దర్శించుటకు వచ్చారు. వారిద్దరు దేవుని వాక్యమును ప్రవచించారు. ఆమె భర్త మా యింటిలో ఉన్నవారందరి కొరకు ప్రార్థించారు. కానీ, చివరిగా ఆమె నా యొద్దకు వచ్చి, వ్యక్తిగతం నీ కొరకు ప్రార్థించాలని తెలియజేసినది. అప్పుడు ఆమె, నీవు నీ భర్తగారు మాట్లాడినట్లుగాను మరియు మీ కుటుంబ సభ్యులు మాట్లాడినట్లుగా మాట్లాడాలని దేవుని అడగవద్దు. ఎందుకంటే, దేవుడు నిన్ను భిన్నమైన మార్గములో ఉపయోగించుకోవాలని కోరుకొనుచున్నాడు '' అని చెప్పెను. 
అదేవిధంగా నా ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకొంటాడు మరియు ప్రతి ఒక్కరిని విభిన్నమైన మార్గములలో వారిని ఉపయోగించుకొంటాడు. కాబట్టి, మీరు ఏ మార్గములో వెళ్లుచున్నారన్నది కాదు, గానీ, మీరు చేయు కార్యములలోను మరియు మీరు వెళ్లు మార్గములలో ఎంతో విశ్వాసముగా పనిచేయండి. అప్పుడు, " ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు '' (1 పేతురు 5:4) అన్న వచనము ప్రకారము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీటమును పొందుకొనునట్లుగా చేస్తాడు. మీరు ఒంటరిగా నడవవలసినప్పుడు, నిరుత్సాహం, తిరస్కరణ మరియు వైఫల్యాన్ని ఎదుర్కొనుచున్నప్పుడు ఏ మానవుడు మీకు సహాయం చేయలేరు. యేసుప్రభువు మాత్రమే మీకు సహాయపడగలడు. అంతమాత్రమే కాదు, విశ్వాసమునకు కర్తయైన యేసు మీద మీ విశ్వాసాన్ని ఉంచినట్లయితే, మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఇంత గొప్పసాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు '' (హెబ్రీయులకు 2:1,2) అన్న వచనముల ప్రకారము మీ యెదుట ఉంచబడిన పందెములో ఓపికతోను విశ్వాసముతోను పరుగెత్తునప్పుడు, నిశ్చయముగా, మీరు విజయమును సాధిస్తారు. 
Prayer:
విశ్వాసమునకు కర్తయైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నిన్ను స్తుతించుచున్నాము. దేవా, నీ యొక్క ఉన్నతమైన పిలుపునకు మేము లోబడి జీవించునట్లు కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీ యందు విశ్వాసము కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుము. దేవా, మా ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, మేము గురి యొద్దకే పరుగెత్తుటకు మాకు కృపనిమ్ము. ప్రభువా, మేము ప్రతి కార్యములలో పొందు ఓటమిలన్నిటిని తొలగించి, వాటన్నిటి మీద విజయము పొందుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000