Loading...
Evangeline Paul Dhinakaran

దేవునికి ఆనందకరమైన ప్రార్థనలకు ప్రతిఫలము!

Sis. Evangeline Paul Dhinakaran
15 Nov
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి ఆనందకరమైన ప్రార్థనలను చేయాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి యున్నాడు. ఎటువంటి ప్రార్థన దేవునికి ఆనందకరముగా ఉండునని బైబిల్లో చూడండి, " యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము '' (సామెతలు 15:8) అన్న వచనము ప్రకారము హెబ్రీ భాషలో " టెఫిలాహ్ '' అను పదమును ఆంగ్లములో ' ప్రేయర్ ' అని తర్జుమా చేయబడినది. ఈ మాటకు, ' ప్రాధేయపడుట, వేడుకొనుట, విన్నపము చేయుట, అభ్యర్థించుట ' అని అర్థము నిచ్చుచున్నవి. సాధారణంగా, అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ' దేవునితో సంభాషించుట ' అని అర్థం. అటువంటి ఉన్నతమైన దేవునితో మనము ఏలాగున సంభాషించెదము? దీనికి జవాబును మనము యాకోబు పత్రికలో కనుగొనెదము. " మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థన చేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును '' (యాకోబు 5:13-15) అన్న వచనములలో చెప్పబడినట్లుగా, మీలో ఎవరికైన శ్రమ సంభవించెనా? ప్రార్థించండి. మీలో ఎవరైన సంతోషంగా ఉన్నారా? మీరు పాటలు పాడి దేవుని స్తుతించండి. విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప విడుదలను తీసుకొని వస్తుంది. మన పరలోకపు తండ్రికి ప్రార్థించుట అనునది ఒక ఆజ్ఞయై యున్నది. 

బైబిల్లో మొదటి రాజుల గ్రంథమును చదివినట్లయితే,అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను '' (1 రాజులు 13:1-16) అన్న వచనముల ప్రకారము దేవుని ఆజ్ఞ మేరకు ఈ దైవజనుడు రాజుకు వ్యతిరేకముగా ప్రవచించెను. రాజైన యరొబాము దానిని విని, అతని మీద కోపగించుకొని మరియు కేకలు పెట్టెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి, " వానిని పట్టుకొనుమని '' చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేకపోయెను. " అప్పుడు రాజు నా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా,'' ఆ దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.
నా ప్రియులారా, నేడు మనము కూడ దేవుని యొద్ద ప్రార్థించి, ఆ దైవజనుని వలె బతిమాలుకొనినట్లయితే, దేవుడు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబు దయచేస్తాడు. నీతిమంతుల ప్రార్థన పట్ల యెహోవా ఆనందిస్తాడు. కాబట్టి, మీరు నీతిమంతులుగా మరియు యథార్థవంతులుగా జీవించాలంటే, దేవుని వాక్యమును జాగ్రత్తగా అనుసరించాలి. మీ సొంత కార్యాలతో పాటు, ప్రభువునందు స్థిరమైన విశ్వాసం మరియు ఆయన వాగ్దానల మీద నమ్మికయుంచినప్పుడు, ఆ వాగ్దానములు మిమ్మును నీతిమంతులనుగా చేస్తుంది. దీనిని గూర్చి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది, " దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను '' (రోమా 4:21,22). అబ్రాహాము యొక్క విశ్వాసము ప్రభువునకు నీతిగా యెంచబడెనని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ కష్ట సమయాలలో కూడ దేవుని యందు స్థిరమైన విశ్వాసమును కలిగి యుంటూ మరియు ఆయన వాగ్దానములను హత్తుకొని జీవించినట్లయితే, ఆయన మీ పట్ల అద్భుత కార్యములను జరిగిస్తాడు. నేడు మీరు జీవించే జీవితము దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉండును గాక. అంతమాత్రమే కాదు, మీరు యథార్థవంతులుగా జీవిస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, అప్పుడు మీ ప్రార్థనలు సంరక్షించబడును మరియు అవి సర్వశక్తిగల దేవునికి మంచి సువాసనగా ఉంటాయి, దేవుడు మిమ్మును దీవించును గాక!
Prayer:
మా నమ్మకమైన ప్రియ పరలోకపు పరమ తండ్రీ, 

నీ యందు నమ్మిక యుంచియున్నాము. నీవే మా పట్ల గొప్ప అద్భుత కార్యములను జరిగించుము. ప్రార్థన ఆలకించు దేవా, సర్వశరీరులు నీ యొద్దకు వస్తారని వాగ్దానము చేసినట్లుగానే, నేడు మేము నీ యొద్దకు వచ్చియున్నాము. మా ప్రార్థనలను ఆలకించి మాకు తగిన జవాబును దయచేయుము. నీ ప్రవక్తలకును మరియు నీ వాక్యమునకు విరోధముగా మేము క్రియ చేసినను లేక మాట్లాడినను దయతో మమ్మల్ని క్షమించి, నీ రెక్కల నీడలో మమ్మును భద్రపరచుకొనుము. దావీదు వలె మేము కూడ నీకు ప్రీతికరముగా జీవించునట్లు సహాయము చేయుము. అబ్రాహాము వలె మేము స్థిరమైన విశ్వాసమును కలిగియుండునట్లును మరియు అది నీకు నీతిగా యెంచబడునట్లును చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

044 - 45 999 000 / 044 - 33 999 000