Loading...
Dr. Paul Dhinakaran

లోకమివ్వలేని తన శాంతితో దేవుడు మిమ్మల్ని నింపుతాడు!

Dr. Paul Dhinakaran
12 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు మరియు మీ కుటుంబానికి దేవుడు శాంతి సమాధానములను అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. అటువంటి దైవీకమైన శాంతిని పొందుకొనుటకు ఏమి చేయాలో తోచక, ఎంతోమంది వారి జీవితాలలో ఉన్న బంధకాల నుండి విడుదల కొరకు మనుష్యుల యొద్దకు అటుఇటు పరుగెత్తుతారు. అయితే, నేడు ఈ లోకమివ్వలేని శాంతిని మీరు పొందాలంటే, ప్రభువైన యేసు వద్దకు రండి. దేవుడిచ్చే శాంతి సమాధానము సమస్త రోగాలకు మరియు దుఃఖానికి ఔషధం వంటిది. సృష్టికర్తయైన దేవుడు తాను సృష్టించిన సృష్టిని దాని సహజ స్థితికి ఎలా మరల తీసుకురావాలో ఆయనకు తెలుసు. వ్యాధుల ద్వారా మరియు సమస్యలు, అప్పుల ద్వారాను, ఇంకను వివిధ రకాల పోరాటల ద్వారా శాంతిని కోల్పోయిన మీకు ప్రభువు ద్వారా ఆదరణ పూరితమైన వాగ్దానం ఇక్కడ మీ కొరకు ఇవ్వబడియున్నది: " అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు '' (యిర్మీయా 30:17) అని సెలవిచ్చిన వచనము ప్రకారము నేడు ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీ గాయాలను మాన్పి మరియు రోగాలను స్వస్థపరుస్తాడు. మీ జీవితములో మీకు శాంతి లేకపోవడం ద్వారా దుఃఖమనే కాడిని మోస్తున్నట్లయితే, లేక బాధపడుచున్నట్లయితే, మీరు ఈనాడు దేవుని రెక్కల క్రిందకు వచ్చినట్లయితే, మీరు సురక్షితంగా ఉంటారు! ఆయన రెక్కల ఆశ్రయం క్రింద, మీరు క్షేమంగా మరియు సురక్షితముగా ఉంటారు. ఆలాగున వచ్చిన సహోదరులు, జేసన్ పాల్ తన మానసిక అనారోగ్యము నుండి ఎలాగున స్వస్థత పొందుకున్నాడో మీ విశ్వాసమును బలపరచుటకు ఈ క్రింది సాక్ష్యమును చూడండి.

దాదాపు 14 సంవత్సరాలుగా నేను హిస్టీరియా వ్యాధితో బాధపడుతున్నాను. నేను ఒంటరిగా బయటకు వెళ్ళలేను, చదువుకోలేని అటువంటి బంధకములను కాడి క్రింద నేను బంధింపబడి, నిత్యము బాధపడేవాడను. తద్వారా, నా కుటుంబ సభ్యులందరు నా గురించి ఎంతో ఆందోళన చెందేవారు. ఈ పరిస్థితిలో, నేను 2003వ సంవత్సరంలో భారత దేశమందు తమిళనాడు రాష్ట్రంలో మధురై పట్టణములో జరిగిన యేసు పిలుచుచున్నాడు ప్రార్థన మహోత్సవములకు హాజరయ్యాను. ఆ రాత్రి, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా డాక్టర్. పాల్ దినకరన్‌గారు, మానసిక వ్యాధితో బాధపడుచున్న వారి విడుదల కొరకు ప్రార్థించారు. నేను కూడ సహోదరులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ సమయంలో నా శరీరంలో ఒక విద్యుత్తు తాకిడి కలిగినట్లుగా ఉండెను. వెంటనే, నేను క్రింద పడిపోయాను. నేను లేచి చూచినప్పుడు, నా శరీరములో నేను పొందుకున్న స్వస్థత ద్వారా గొప్ప శాంతితో నా హృదయము నింపబడినట్లుగా నేను అనుభూతి చెందాను. ఆ రోజు నుండి నేను ఆ భయంకరమైన అపవాది శక్తుల నుండి విడుదల పొందుకున్న తరువాత, దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచిపోయినవి. ఇప్పుడు నేను ఎంతో ఆరోగ్యకరముగాను మరియు శాంతితో నింపబడిన మనస్సుతో ఒక సాధారణమైన వ్యక్తివలె ఒంటరిగా పనులన్నియు చేయగలుగుచున్నాను. దేవునికే సమస్త మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, మన దేవుడు ఎంత మంచివాడు! నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇప్పుడు కూడా, ఈ మాటలు చదివేటప్పుడు యేసు మిమ్మల్ని కూడ అటువంటి శాంతితో నింపుతాడు. కేవలం దేవుని మీద మీ నిరీక్షణను మరియు నమ్మకమును ఉంచండి. ఆయన మహిమ మీ మనస్సును, శరీరాన్ని దేవుని ఆలయంగా మారుస్తుంది మరియు అశాంతిని కలిగించే పర్వతం లాంటి అలజడులన్నియు ఆయన సన్నిధిలో కరిగిపోవును. శారీరకంగాను లేదా మానసికంగాను దైవీకమైన స్వస్థత మీకు అవసరమా? ఆలాగైతే, నేడు మీరు ఆయన అద్భుతమైన ' యేసు ' అను నామమును పలికినప్పుడు, లోకమివ్వలేని ఆయన యొక్క శాంతి మిమ్మల్ని సంపూర్ణంగా నింపుతుంది. ఈనాడు సమస్యలతో నిండిన మీ హృదయములో ప్రభువు శాంతి అను ఔషధముతో నింపుతాడు. అందుకే యేసు ప్రభువు మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు, " శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి '' (యోహాను 14:27). బైబిల్‌లో హెబ్రీయులకు 4:12 వ వచనము ఇలాగున చెబుతుంది, " ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. '' అవును, దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతి వాగ్దానాన్ని మీ హృదయంలో వాటి నిమిత్తము నమ్మకముంచినట్లయితే, నేడు మీరు ఎదుర్కొంటున్న పోరాటాలన్నిటిని దేవుడు ఇచ్చిన శాంతి ద్వారా జయిస్తారు. ఆయన వాక్యము మీ ఆత్మను నుండి అటువంటి శాంతిని ప్రవహించునట్లు చేస్తుంది! అంతేకాక, మీరు మోయుచున్న ప్రతి కాడిని మరియు బంధకములను ఆయన బ్రద్ధలు చేయుట మీరు చూచెదరు. మీరు విడుదలతో జీవిస్తారు. ఇప్పుడు కూడా, అటువంటి శాంతిని తిరిగి పొందుటకు యేసు గాయపడిన హస్తాలు మీపై ఉన్నాయి. కారణము, " దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు '' (2 తిమోతి 1:7) అన్న ఈ లేఖన భాగమును మీ కొరకు స్వంతము చేసుకొనండి, ఆలాగైతే నిరాశపడవద్దు, మీరు గొప్ప అద్భుతమును చూస్తారు. కాబట్టి, ఈనాడు మీ కుటుంబములో శాంతి సమాధానము కొరత కలిగియున్నట్లయితే, నేడే సమాధానకర్తయైన దేవునికి మీ జీవితాలను సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా ఆయన మీ గృహములోనికి మరియు జీవితములోనికి వచ్చి, లోకము ఇవ్వలేని శాంతి సమాధానముతో మిమ్మల్ని నింపి పరవశింపజేస్తాడు.
Prayer:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరమ తండ్రీ,

నిన్ను స్తుతించుచున్నాము. ఎటువంటి స్థితిలోను మేము నిన్ను విడువకుండా హత్తుకొని జీవించునట్లు మాకు సహాయము చేయుము. మా కుటుంబములో ఉన్న పోరాటములను తొలగించి, మాకు నీ యొక్క దైవీకమైన సమాధానమును అనుగ్రహించుము. వ్యాధితో బాధపడుచున్న మమ్మల్ని నీ దివ్య హస్తములకు అప్పగించుకొనుచున్నాము. దేవా, శాంతిలేని మా కుటుంబములో నీ శాంతితో మమ్మల్ని నింపుము. లోకమివ్వలేని శాంతిని మాకు దయచేయుము. శాంతితోను మరియు సమాధానముతోను మేము ఈ లోకములో జీవించునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000