Loading...
Evangeline Paul Dhinakaran

తల్లివంటి హృదయం గల దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
01 Oct
నా ప్రియమైనవారలారా, ఈ నూతన మాసములో అడుగిడిన మీకు శుభాభివందనములు తెలియజేయుచున్నాను. నేడు దేవుని యొక్క నీతిలో మిమ్మును స్థాపించాలని మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. అందుకే ఈ నెల వాగ్దానముగా, బైబిల్ నుండి యెషయా 54:14వ వచనమును తీసుకొనబడినది. నేడు ఆ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, " నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు '' అనే వాగ్దానం ప్రకారం ప్రభువు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం కదా!

నా ప్రియులారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును తన యొక్క నీతిలో ఎలా స్థిరపరుస్తాడు? మన దేవునికి తల్లి వంటి హృదయం కలదు. మన తల్లుల పాత్ర మన పట్ల ఏమనగా, ' మన క్షేమమును గురించి శ్రద్ధ వహించడం, ఉదయాన్నే నిద్రలేపడం మరియు మనలను బైబిల్ చదవమనడం, మరియు ఇవన్నియు మనము చేయుచున్నామా? లేదా? అని నిర్ధారించుకోవడం వంటి అనుభవం మనందరము కలిగియున్నాము కాదా? ' అదేవిధముగా, ఒక తల్లి పాత్రవలె మన ప్రభువు కూడ మన జీవితమును గురించి శ్రద్ధ వహిస్తాడు. బైబిల్ ఇలా చెబుతుంది, " అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు '' (యెషయా 50:4) అన్న వచనము ప్రకారము ఇదియే ఒక తల్లి వంటి హృదయము గల దేవుడు. ఈ విధంగానే, ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును తన నీతిలో స్థిరపరుస్తాడు. కాబట్టి, దేవునితో కలిసి జీవించే అనుభవజ్ఞానము, అనుబంధం కలిగి ఉండండి. ఎల్లప్పుడూ ఆయన మాట వినండి మరియు ఆయన మాటకు లోబడి జీవించండి.
అవును, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ విధంగా దేవునికి విధేయత చూపినప్పుడు, ఆయన మిమ్మల్ని నూతన భాషలతో నింపుతాడు అని బైబిల్ చెబుతుంది. అందుకే చూడండి, " అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను '' (జెఫన్యా 3:9) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ ఆయన నామమును బట్టి యేకమనస్కులై ఆయనను పవిత్రమైన పెదవులతో సేవించాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, ప్రియులారా, నేడు మీరు దేవుని సేవించుటకు ప్రభువు మీ పెదవులను పవిత్రపరుస్తాడు. నేడు మీరు దేవుని హత్తుకొని జీవించినప్పుడు, ఆయన మీ పట్ల తల్లి చూపే సంరక్షణతో శ్రద్ధ వహించుటకు, మీ పట్ల తన నిబంధను, ప్రేమను ఘనపరచేవాడు మరియు ఎన్నటికి మారనివారుగా, ఆయనలో స్థిరంగా నిలిచియున్నప్పుడు ఆయన మిమ్మును తన నీతిలోనికి నడిపిస్తాడు. ఈరోజు ప్రభువు తన నీతిని మీకు అనుగ్రహించును గాక. శుభవార్త ఏమిటంటే, మీరు ఆయన ముందు పవిత్రమైన జీవితాన్ని గడపడానికి యేసు ఇప్పటికే తన నీతిని మీకు ఇచ్చియున్నాడు. కాబట్టి, మీరు ఆయన నీతిని పొందేలా, పాపం లేనివాడు తనను తాను సమర్పించుకున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని నీతిని కలిగి ఉన్నప్పుడు, మీరు దేనికిని భయపడరు. మీరు ఏ హానిని ఎన్నటికిని చూడలేరు. మీరు తృణీకరించబడరు. బదులుగా, మీ తల ప్రజలందరి కంటే పైకి లేవనెత్తబడుతుంది. ఆ విధంగా ప్రభువు మీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి, సంతోషించండి మరియు ప్రభువులో ఆనందించండి. దేవుడు ఈ నూతన మాసమంతయు నీతితోను, సంపదతోను మిమ్మును దీవించును గాక.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

ఈ నూతన మాసములో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా కొరకు సిలువపై నీ నీతిని ఇచ్చినందుకై నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మా జీవితాన్ని నీ దివ్య హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. దేవా, మా ఆంతర్యములో రూపాంతరం చెందడానికి మరియు నీ యెదుట పవిత్రంగా జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నేడు నీవు మా పట్ల వాగ్దానం చేసినట్లుగానే, నీ నీతిలో మమ్మును స్థిరపరచుము. ప్రభువా, నిన్ను స్తుతించుటకు మా పెదవులను పవిత్రపరచి, మమ్మును నూతన భాషలతో నింపుము. దేవా, మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు ఒక నూతన ఆనుభవాన్ని అనుభవించుటకు మాకు సహాయం చేయుము. దేవా, మేము అనుదినము నీకు సమీపముగా నడవడానికి మాలో నీ నీతిని స్థాపించుము. దేవా, ఈ నూతన మాసమంతయు నీవు మాకు తోడుగా ఉండి, మమ్మును నూతన మార్గములో నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000