Loading...
Dr. Paul Dhinakaran

మీ సంతానమును ఆశీర్వదించే దేవుడు!

Dr. Paul Dhinakaran
13 Jan
నా ప్రియులారా, మన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన వాగ్దానము చేసినట్లుగానే, దానిని నెరవేరుస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో ఆయన అనుగ్రహించిన వాగ్దానములను మీరు విశ్వాసముతో హత్తుకొన్నట్లయితే, నిశ్చయముగా, ఆ వాగ్దానములన్నిటిని మీ జీవితములో నెరవేరుస్తాడు. మంచి మరియు చెడు కాలములో మనము దేవునికి విధేయులై యుంటూ, లోబడినట్లయితే, మీరు అనేక ఆశీర్వాదములను పొందుకొనుటకు మీకు సహాయము చేస్తాడు. అందుకే వాక్యమేమంటుందో చూడండి, " కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును '' (యెషయా 54:3) అన్న వచనము ప్రకారము మీ పట్ల ఈ వాగ్దానమును నెరవేరుస్తాడు. యెషయా గ్రంథములో 54వ వచనములో ప్రవక్తయైన యెషయా, దేవుని వాక్యము ద్వారా తన బిడ్డలైన వారిని ప్రోత్సహించుచున్నాడు. అవమానము, నిందలు, శాపము సంపూర్ణంగా బ్రద్దలు చేయబడుట ద్వారా ఇశ్రాయేలు ఫలభరితముగా మారినది. ఇదేవిధముగా, దేవునికి లోబడి, మీరు దేవుని యొక్క నిబంధనలను అనుసరించినట్లయితే, దేవుడు మీ మధ్యలో ఆశ్చర్యకార్యములను జరిగిస్తాడు. 

1990లో దక్షిణ ఆఫ్రికాలో ఒక దంపతులు ఉండేవారు. అతడు దక్షిణ ఆఫ్రికాకు చెందినవాడును మరియు అతని భార్య బ్రిటిష్ పౌరసత్వము గలది. దేవుడు వారిని ఇంగ్లాండుకు వెళ్లమని చెప్పాడు. దేవుని పిలుపునకు విధేయత చూపినవారై ఇంగ్లాండుకు వెళ్లారు. అయితే, దేవుడు ఇంగ్లాండుకు వెళ్లమని ఎందుకు చెప్పాడో వారికి తెలియదు. వారు ఇంగ్లాండుకు వెళ్లినప్పుడు వారి వద్ద ఏమీ లేదు. వారి జేబులు ఖాళీగా ఉన్నవి. వారికి తెలిసినవారు గానీ, సంఘము గానీ, ఎవరు లేరు. అక్షరాల వారి యొద్ద ఏమీ లేవు. ఒకరోజు రాత్రి దేవుడు వారిని నిద్రలేపి, " ఐరోపాలోను మరియు ఐరోపా వ్యాప్తంగా క్రిష్టియన్ టెలివిజన్ను ప్రారంభించుడి '' అని చెప్పాడు. వారి శూన్యత నడుమ, దేవుడు వారికిచ్చిన బాధ్యతను స్వీకరించి, ప్రార్థించారు. ఇప్పుడు వారు రెండు ఛానల్స్ను ప్రారంభించునట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరియు ఒక సంవత్సరమంతయు ఐరోపాలో నున్న 62 దేశాలకు సువార్తను, టి.వి. ఛానల్స్ ద్వారా ప్రసారము చేయుచున్నారు. 
ఇటువంటి సాధారణమైన విధేయతనే దేవుడు కోరుకొంటున్నాడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఈ విధేయత ద్వారా దేవుడు మహిమపరచబడుచున్నాడు. నా ప్రియులారా, దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రణాళికను పొందుకొనియున్నారా? ఆలాగైతే, వెంటనే దానికి విధేయతను చూపండి, నేడు ఆయన వెలుగు మీ హృదయములో ప్రకాశించును గాక మరియు దేవుని రాజ్యము కొరకు మీరు నెరవేర్చని కార్యాలు ఏమైనా ఉన్నవేమో ఒకసారి పరిశీలించుకొనండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా సంపూర్ణమైన తృప్తి కలుగును. గనుక లేచి ప్రకాశించుడి! లేచి వెళ్లుడి, భూమికి ఉప్పైయుండండి, ప్రపంచానికి వెలుగై ప్రకాశించండి. " మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను '' (ఆదికాండము 22:18) అన్న వచనము ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుట మాత్రమే కాదు, మీ సంతతిని కూడ ఆశీర్వదిస్తాడు. 
Prayer:
ప్రేమ దయగల మా ప్రియ పరమ తండ్రీ, 

నీ యొక్క ప్రశస్తమైన పిలుపుకు అవిధేయత చూపిన దినములను బట్టి, మేము పశ్చాత్తాపపడుచున్నాము. ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. మేము నీ రక్షణ వెలుగును విస్తరింపజేయుటకు మరియు దేవుని రాజ్యాన్ని కట్టుటకు సహాయము చేయుము. దేవా, నీవు మా పట్ల చేసిన వాగ్దానములన్నిటిని నెరవేర్చుము. భూలోకములో ఉన్న జనములకంటే, మా సంతానమును ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినట్లుగానే, మా జీవితములో నెరవేర్చుము. మా సంతతి సంతతిని దీవించుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, మేము నీ నిబంధనలను మరియు కట్టడలను అనుసరించి, నీకొరకు లేచి ప్రకాశించునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000