Loading...
Stella dhinakaran

నీతిమంతులు తమ మార్గములను విడువక ప్రవర్తించుదురు!

Sis. Stella Dhinakaran
11 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని యందు నీతియు యథార్థమైన భక్తి కలిగియుండాలనియు ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి," నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను '' (ఎఫెసీయులకు 4:24) అన్న వచనము ప్రకారము జీవితమును సమస్త బంధకముల నుండియు, పాపముల నుండియు సమస్త కల్మషముల నుండియు పరిశుద్ధత పొందినప్పుడు, పై చెప్పబడిన వచనము ప్రకారముగా నవీన స్వభావమును ధరించుకొని యేసుక్రీస్తు అనుగ్రహించు విమోచనను పొందుకొనెదరు. దానియేలు మరియు అతని యొక్క స్నేహితులు బంధీలుగా బబులోను మహా నగరమునకు కొనిపోవునప్పుడు వారు యౌవన ఇశ్రాయేలీయులుగా ఉండిరి. ఆలాంటి స్థితిలో కూడ వారు ఇతర దేవతలను పూజింపక ఎంతో స్థిరముగా ప్రభువునందలి విశ్వాసము ద్వారా విశ్వాసపు నాయకులుగాను మరియు దేవునికి గొప్ప సాక్షులుగాను నిలిచిరి. అంతటి సాటిలేని విశ్వాసము ద్వారా వారు హెచ్చింపబడిరి!

కళాశాలలో చదువుచున్న ఒక విద్యార్థి తమ తల్లిదండ్రులకు ఏకైక కుమారునిగా నుండెను. వారికి వచ్చే కొద్ది ఆదాయముతో వారు ఎంతో కష్టపడి ఎన్నో శ్రమల మధ్య అతనిని చదివించుచుండిరి. కానీ, ఈ పడుచువాడు తన తరగతులకు సరిగ్గా వెళ్లక తమ స్నేహితులతో కూడ కలిసికొని ఎంతో విలాసాలకు మరియు చలన చిత్రములకు వెళ్లుటకు అలవాటు పడెను. తద్వారా, అతను వరుసగా తన యొక్క చదువులలో అపజయమును పొందాడు. ఇలాంటి తరుణములో ప్రభువు ఆయన యొక్క దైవీకమైన ప్రేమ ద్వారా అతని జీవితమును మార్చెను. అటుతరువాత, అతను ఎంతో కష్టపడి చదివి, దేవుని సహకారము ద్వారా తన యొక్క కళాశాల చదువును కూడ పూర్తి చేసెను. అతను ఎంతో స్థిరముగా ప్రభువు కొరకు నిలబడి తనలాగా జీవించుచున్న వారికి దేవుని యొక్క దైవీకమైన ప్రేమను బోధించేవాడు. అతను ఎంతో గొప్ప సంఖ్యలో కూడుకొనిన ప్రజల మధ్యలో ఒక నక్షత్రమువలె ప్రకాశించెను. ప్రభువు అతని యొక్క ఉత్సాహమును మరియు అతని యొక్క విశ్వాసమును చూచి, అతనిని మంచి ఉద్యోగముతోను మరియు మంచి జీవిత భాగస్వామితోను ఆశీర్వదించి, అతని ప్రతి పనిలోను అతనిని ఆశీర్వదించి ఉన్నత స్థానమునకు హెచ్చించాడు.
అవును నా ప్రియులారా, ముఖ్యముగా యౌవనులారా, దుర్మార్గములలో నడువక, దేవునికి ప్రీతికరమైన నీతియుక్తమైన మార్గములలో నడుచుకొనుచూ, ఆయన యొక్క ఎనలేని ఆశీర్వాదములను పొందండి. అవును, ఈ లోక మార్గాలను అనుసరించవద్దు. ప్రభువు మిమ్మల్ని విడిపించి మీకు నూతన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే లేఖన భాగము మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, " యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే '' (కీర్తనలు 24: 3,4) అన్న వచనముల ప్రకారము దేవుని దయను పొందుకొనే నీతి మార్గాలలో నడుచుకొనండి, ఆయన సమృద్ధి ఆశీర్వాదములను పొందుకొనం డి. అప్పుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని వాక్యము ప్రకారం బలపడతారు, ఈ లోకములో దేవుని ప్రేమకంటే గొప్పది మరొకటి లేదు. " అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు '' (యోబు 17:9) అన్న వచనము ప్రకారము ఆయన నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని గొప్ప స్థానమునుకు హెచ్చిస్తాడు.
Prayer:
ప్రేమా నమ్మకమైన మా ప్రశస్తమైన పరలోకపు తండ్రీ,

నీతియుక్తమైన మార్గములలో నిలకడగల విశ్వాసముతో నడుచు భాగ్యమును మాకు దయచేయుము. తద్వారా నీ యొక్క ఎనలేని ఆశీర్వాదములను పొందుకొనుటకు మాకు నీ కృపను చూపుము. మా జీవితములో ఉన్న పాపములను మరియు అతిక్రమములను క్షమించి, మమ్మల్ని నిరపరాధులనుగా యెంచుము. నీ నీతిగల మార్గములను విడువకుండా ఎల్లప్పుడు దాని యందు మేము నడుచుకొనుటకు మాకు సహాయము చేయుము. నీ యందు మాకున్న నిరీక్షణ ద్వారా మేము స్థిరమైన విశ్వాసమును కలిగి యుండుటకు సహాయము చేయుము. మాలో అవినీతి కార్యాలు ఉన్నట్లయితే, నేడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి నీతిమంతులుగా తీర్చి, ఈ లోకములో మేము పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు మధురమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.
 

For Prayer Help (24x7) - 044 45 999 000