Loading...
Dr. Paul Dhinakaran

మీ కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చే దేవుడు!

Dr. Paul Dhinakaran
11 Oct
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును దేవుడు ఆశీర్వదించాలనియు మరియు ఆయన ప్రేమను మీ పట్ల కనుపరచాలనియు కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించును '' (ద్వితీయోపదేశకాండము 7:13) అన్న వచనము ప్రకారము, ద్వితీయోపదేశకాండము అను గ్రంథము " రెండవ చట్టము '' అని అంటారని సాధారణంగా మనకు తెలుసు. మోషే దీనిని రచించాడు. మోషేకు ఇవ్వబడిన పది ఆజ్ఞలు మరియు దేవుడు తన ప్రజలను (ఇశ్రాయేలీయులను) పరిపాలించే చట్టాలను మరల పరిశీలన చేసియున్నాడు గనుకనే రెండవ చట్టము అని పిలువబడినది. ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుటలో మనము ఎంతో శ్రద్ధ వహించాలి. ఎంత ఎక్కువగా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించుదుమో, మన జీవితములో అంత ఎక్కువగా ఆయన దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. మరియు తన బిడ్డల యొక్క మొఱ్ఱను విని, వారి శ్రమలో వారికి జవాబిస్తాడు. ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. 

ఒక కారుణ్య పూర్వపు విధ్యార్థిని జీవితములో వివాహము జరిగి 14 సంవత్సరములైనను తనకు సంతానము కలుగలేదు. వారు ఎంతో వేదనతో ప్రభువు సన్నిధిలో కన్నీటితో మొఱ్ఱపెట్టిరి. మొదటి బిడ్డ చక్కగా చనిపోయి పుట్టినది. మరియు రెండవ బిడ్డ, గర్భములోనే చనిపోయినది. ఆమె వేదనను అధికము చేయుచు, ఆమె కొరకు ప్రార్థించిన ఒక వ్యక్తి, " నీవు చాలా ఘోరమైన పాపమును చేశారు. అందువలన నీవు గర్భము ధరించిన ప్రతిసారి బిడ్డను పోగొట్టుకొనుచున్నావు. నీకు ఇక పిల్లలు ఉండరు '' అని చెప్పెను. అది విన్న ఆమె ఇంకా కృంగిపోయినది. తాను ఏమి చేయాలో తెలియక, ప్రభువు సన్నిధిలో కన్నీటితో మొఱ్ఱపెట్టినది. " ప్రభువా, నా కొరకు ఎవరైన ప్రార్థించునట్లు సహాయము చేయుము. దయచేసి నా కొరకు ఎవరినైన పంపించుమని '' ఆ సమయములో ఆ ఆమ్మాయితో మాట్లాడలనే గొప్ప ప్రేరణ నాలో కలిగినది. అప్పుడు నేను ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించి, " నేను పాల్ దినకరన్ను మాట్లాడుచున్నాను, నీ కొరకు ప్రార్థించాలని నేను ఎంతగానో భారమును కలిగియున్నాను '' అని చెప్పిన వెంటనే, దుఃఖమును నియంత్రించుకోలేక ఏడ్చింది. ఆమె తాను ఎదుర్కొంటున్న సమస్యలను గురించి నాకు తెలియజేసి, తన కొరకు ప్రార్థించమని కోరింది. ఆమె యొక్క విషాదకరమైన పరిస్థితిని విన్నప్పుడు, నేను కూడ కన్నీటితో ఆమె కొరకు దేవుని సన్నిధిలో మొఱ్ఱపెట్టాను. ఎంత గొప్ప అద్భుతం చూడండి! దేవుడు ఆ ప్రార్థనను విని, 14 సంవత్సరముల నుండి సంతానము లేని ఆమెకు ఒక అందమైన బిడ్డను అనుగ్రహించి, ఆమెను దీవించాడు. 
నా ప్రియులారా, ఇదియే, దేవుని యొక్క మంచితనము. ఆయన మిమ్మల్ని మరియు మీ ప్రార్థనలను ఎన్నడును తృణీకరించడు. మీరు ఎంతో కాలము నుండి సమస్యలతో బాధపడుచున్నారా? నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సంతానము లేకుండా కన్నీటితో విలపిస్తున్నారా? ఆయన మీ కన్నీటిని చూస్తున్నాడు. దేవుడు మీ కొరతలను తొలగించి, మీ హృదయములో ఉన్న వాంఛలను తీరుస్తాడు. ఆయన కేవలం మిమ్మును ప్రేమించుచున్నాడు. మీరు ఆయన యందు భయభక్తులు కలిగియుంటూ, ఆయన మీకిచ్చిన వాగ్దానములను విశ్వాసించినట్లయితే, ఆయన మీ జీవితములో గొప్ప కార్యములను జరిగిస్తాడు. కాబట్టి, ధైర్యము తెచ్చుకొనండి. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
ప్రేమకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

ప్రభువా, నీవు మా పట్ల చూపిన ప్రేమ ఎంతో అపారమైనది. నీ ప్రేమకు మేము బద్ధులమగునట్లు మాకు సహాయము చేయుము. నీ యందు మేము భయభక్తులు కలిగియుంటూ, నీ వాగ్దానముల యందు విశ్వాసము కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుము. దేవా, మేము సంతానము లేకుండా ఎంతో వేదన అనుభవించుచున్నాము. నీవు మా కన్నీటి వేదనను మార్చి, మాకు ఈనాడే ఒక చక్కటి బిడ్డను దయచేయుము. ప్రభువా, నీవు మమ్మును ప్రేమించుచున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీ ప్రేమ ద్వారా మా హృదయ వాంఛలను నీవు తీర్చి, మా జీవితములో గొప్ప కార్యాలు జరిగించి మమ్మును ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000