Loading...
Dr. Paul Dhinakaran

రహస్య స్థలములలోని మరుగైన ధనమును మీకిస్తాడు!

Dr. Paul Dhinakaran
06 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు మరుగైన ధనమును ఇచ్చి, మిమ్మల్ని ఐశ్వర్యవంతులనుగా చేయాలని ప్రభువు కోరుచున్నాడు. ఒకవేళ నేడు మీరు దరిద్రతలో ఉన్నట్లయితే, దేవుడు వాగ్దానము చేయుచున్నాడు, ‘‘ నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకార స్థలములలో ఉంచబడిన ని‘దులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను ’’ (యెషయా 45:2,3) అన్న వచనముల ప్రకారము ప్రవచన వరము ద్వారా ఈ లోకములో ఎలాగున ఉండాలనియు దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. మన ప్రభువు మనకు ముందుగా వెళ్లి మెట్టగా నున్న స్థలమును సరాళము చేస్తాడు. మరియు ఆయనే దేవుడని మనము గుర్తించునట్లుగా, అం‘దకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును మనకిచ్చి, మన అవసరతలన్నిటిని తీరుస్తాడు. 

అనేక సంవత్సరాల క్రితము, కృప చేత ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అభిషేకమును ఒక కుటుంబము వారందరు పొందుకున్నారు. ఆ కుటుంబము పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం నడిపించబడెను. అయితే, ఒక సందర్భములో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు, ‘‘ అర్మేనీయాలో కరువు సంభవించబోవుచున్నది. కాబట్టి, సమస్తాన్ని వదిలివేసి, అమెరికాకు వెళ్లమన్నాడు. ’’ వెంటనే వారు దేవుని మాటకు లోబడి, అమెరికాకు వెళ్ళారు. వారు అమెరికా దేశమునకు వెళ్లినప్పుడు, వారికి ఏమి చేయాలో తెలియలేదు. మరల పరిశుద్ధాత్మ వారితో,  ‘‘ కొన్ని పశువులను కొనుగోలు చేసి పాల వ్యాపారము చేయమని ’’ చెప్పెను. వారు దేవుని స్వరమునకు లోబడి వ్యాపారమును ప్రారంభించారు. కోటీశ్వరుడైయ్యే అంత వరకు దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించాడు. అప్పటి నుండి వారు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ గాస్పల్ వ్యాపార వేత్తల సహవాసమును స్థాపించారు. అటుతరువాత, వారు, ‘‘ ది హాప్పియస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ ’’ అను పుస్తకమును వ్రాశారు.
అదేవిధముగా, నా ప్రియులారా, నేడు ఈ ప్రపంచములోనే ప్రభువు మిమ్మల్ని ఆనందమైన వ్యక్తులనుగా మారుస్తాడు. మీ జీవితములో పరిశుద్ధాత్మను మీరు పొందియున్నప్పుడు ఆయన మిమ్మల్ని వర్థిల్లజేస్తాడు. అందుకు బైబిలేమంటుందో చూడండి, ‘‘ మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము ’’ (గలతీయులకు 5:25). మీ జీవితాలను దేవునికి సమర్పించి, ఆయన సన్నిధిలో తన పరిశుద్ధాత్మతో నింపమని అడగండి, అప్పుడు ఆయన తప్పకుండా మీ  హృదయ వాంఛలను నెరవేరుస్తాడు. దేవుని మెల్లని స్వరమును వినుటకు ఆయన మీకు సహాయము చేస్తాడు. ఇహలోకపు చింతలు మరియు బాధలలో మీరు దేవుని యొక్క మెల్లని స్వరమును వినకుండా ఆటంకపరచుకుండును గాక. అదే  సమయములో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని యేసు మనలను హెచ్చరిస్తున్నాడు. ‘‘ సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసినవాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను ’’ (మార్కు 3:28-29). పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకును మరియు ఆయన ఉపదేశమును పొందుటకును పరిశుద్ధాత్మను మీ జీవితములోనికి అనుమతించండి. ఆయన మీకు సమృద్ధిని అనుగ్రహించి, అసాధారణమైన వ్యక్తులనుగా మిమ్మల్ని మారుస్తాడు.
Prayer:
కృపాతిశయములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నీ పాదములకు స్తుతులు చెల్లించుచున్నాము. దేవా, మేము నీ మెల్లని స్వరమును వినుటకు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము. మేము ఎక్కడైతే, నష్టాన్ని అనుభవించియున్నామో, అక్కడనెల్ల మాకు కీర్తి మరియు ఘనతను అనుగ్రహించుము. ప్రభువా, మాకు ముందుగా వెళ్లి మెట్టగా ఉన్న మా జీవితాలను సరాళము చేయుము. పై చెప్పబడిన వ్యాపారవేత్త వలె మేము కూడ నీ మెల్లని స్వరమునకు లోబడి, ఉన్నత స్థానమునకు హెచ్చింపబడుటకు సహాయము చేయుము. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును మాకిచ్చి మా దరిద్రతను మార్చుము. మా వంకర మార్గములను నీవు సరాళము చేసి మేము పోగొట్టుకున్న సమస్తాన్ని రెండింతలుగా దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

044 - 45 999 000 / 044 - 33 999 000