Loading...
Stella dhinakaran

ఐశ్వర్యముతో, గొప్పతనముతో తృప్తిపరచే దేవుడు!

Sis. Stella Dhinakaran
14 Sep
నా ప్రశస్తమైన  స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు గొప్ప ఐశ్వర్యమును, ఘనతను అనుగ్రహించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన మాత్రమే కలుగుతుంది. కానీ, ఈ లోకములో ఎవరు కూడ దానిని మనకు ఇవ్వలేరు. అందుకే బైబిల్లో చూడండి, " ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు'' (1 దినవృత్తాంతములు 29:12) అన్న వచనము ప్రకారము మీరు దారిద్య్రమును అనుభవించుచున్నారా? ఆర్థికంగా ఇబ్బందులు పడుచున్నారా? ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడము వలన మీరు మీ యొక్క శాంతి సమాధానము మరియు ఆనందమును కోల్పోయి వున్నారా? ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల మధ్యలో మీరు ఏలాగున దేవుని యొద్ద నుండి ఎలాంటి ఆశీర్వాదాలను పొందవచ్చునో బైబిల్లో చూడండి, " ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని యొద్ద నుండే వస్తాయి '' అని చెప్పబడినది. కాబట్టి, మీరు దేవుని వాక్యమునందు నమ్మికయుంచినప్పుడు, మీ ఆర్థిక సమస్యలన్నియు అంతరించిపోతాయి. భయపడకండి, ఆయన సమస్తాన్ని ఏలువాడు గనుకనే, ఆయన మీకు సమస్తాన్ని ధారాళముగా అనుగ్రహిస్తాడు. 

సహోదరులు డి.జి.యస్. దినకరన్గారిని నేను వివాహము చేసుకొన్నప్పుడు ఆయనగారి జీతము రూ. 160/- మాత్రమే సంపాదించేవారు. అందులోనే దేవుని పని కొరకు రూ. 16/- కేటాయించేవారు. ఈ డబ్బుతో నెలంతయు ఏలాగున నిర్వహించగలము అని నేను ఆశ్చర్యపోయేదానిని. కానీ, మిగిలిన రోజులన్నియు దేవుడు మా అవసరతలన్నిటిని తీర్చేవాడు. ప్రారంభములో మేము ప్రతినెల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికిని, మేము కుటుంబముగా కలిసి దేవుని సన్నిధిలో మోకరిల్లి మా జీతములో దశమభాగమును ప్రభువునకు సమర్పించేవారము. ప్రజల చేత మేము విమర్శించబడినప్పటికిని, మా జీవితములో ప్రభువునకు మొదటి స్థానమును ఇచ్చినప్పుడు, ఆయన మాకు అద్భుతమైన విధముగా ఒక అందమైన గృహమును మరియు ఒక కారును అనుగ్రహించి మమ్మును దీవించాడు. అది చూసి దేవుడు మాతో కూడ ఉన్నాడని ప్రజలు సాక్ష్యమిచ్చారు.
నా ప్రియులారా, ఈ ఆశీర్వాదాలను పొందడానికి మీరు మూడు పనులు చేయాలి. మొదటిగా, వాగ్దానము చేసిన దేవుడు తప్పకుండా మీ అవసరతలన్నిటిని తీరుస్తాడని మీరు నమ్మాలి. మీరు దేవుని వాక్యమును చదివినప్పుడు, ఆ వాక్యమును మీరు కంఠస్థము చేయాలి. ఆ వాక్యము మీలో పని చే యాలి. మీ జీవితములో దేవుని ఆశీర్వాదాలను పొందునట్లు, ఎప్పుడు కూడ దీవెనకరమైన మాటలనే పలకాలి. రెండవదిగా, ఎప్పుడైతే, మీరు జీతమును పొందుకుంటారో, ప్రార్థన సమయమప్పుడు మీ కుటుంబ సభ్యులందరిని పిలిచి, ప్రభువు సన్నిధిలో మోకరించి, " ప్రభువా, ఈ నెలంతటికి మేము అందుకున్న మొత్తము ఇంతే, ఈ చిన్న మొత్తములో ఈ నెలంతయు నేను నిర్వహించలేను. అయితే, మాకేమి అవసరతలున్నవో వాటన్నిటిని నీవు ఇవ్వగలవని మేము విశ్వసించుచున్నాము. నీవు మా అవసరతలన్నిటిని తీర్చే దేవుడవు, ఈ కొంచెము మొత్తమును ఆశీర్వదించుమని '' ప్రార్థించండి. 

మరియు చివరిగా, మీరు దేవుని యొద్ద నుండి ఏమైతే పొందుకుంటారో, దానిలో నుండి పదయవ భాగమును దేవునికివ్వాలి. అప్పుడు దేవుడు, (మలాకీ 3:10వ వచనము) కొలతలేకుండా మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఏలాగనగా, మీరు అడిగినవాటికంటెను, ఊహించినదానికంటెను అత్యధికముగా అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క మేలులతో మిమ్మును సమృద్ధిగా తృప్తిపరుస్తాడు. మీ చుట్టు ఉన్న ప్రజలు మీ సంపదను చూచి, దేవుని సన్నిధి మీతో కూడ ఉన్నదని వారు సాక్ష్యమిస్తారు. 
Prayer:
సర్వసంపదలు కలిగిన మా ప్రియ ప్రభువా, 

నిన్ను మహిమపరచుచున్నాము. దేవా, నీవు సమస్తమును ఏలువాడవు గనుకనే, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. నీ వలన కలిగే ఐశ్వర్యము, గొప్పతనమును మాకు సమృద్ధిగా అనుగ్రహించుము. మేము ప్రతి నెల అనుభవించు ఆర్థిక ఇబ్బందులను ఈనాటి నుండి తొలగించుము. మేము పొందుకొను జీతములో నీ సన్నిధికి దశమ భాగమును తీసుకొని వచ్చునట్లు మాకు అటువంటి హృదయమును దయచేయుము. సమస్తాన్ని దయచేసే నీ యందు మేము నమ్మిక యుంచి, నీ వాక్యమును మా హృదయములో పదిలపరచుకొనునట్లు కృపనిమ్ము. మా ప్రతి అవసరతను క్రీస్తు యేసులో తీర్చి, మా పేదరికమును దరిద్రతను తొలగించి మమ్మును నీ యొక్క సమృద్ధి దీవెనలతో నింపుమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000