Loading...
Stella dhinakaran

మీ నోటికి తోడైయుండి, మీకు బోధించే దేవుడు!

Sis. Stella Dhinakaran
21 Jul
నా ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మీ నోటికి తోడైయుండి, ఎవరితో ఏమి మాట్లాడవలెనో మీకు ఆయనే బోధిస్తాడు. " నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను '' (నిర్గమకాండము 4:12) అన్న వచనము ప్రకారము అసూయ మరియు విబేధాలు నిండిన ఈ ప్రపంచములో మనము జీవిస్తున్నాము. ఆలాగుననే, మీరు నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికిని, మీ అనుదిన జీవితములో వివిధ రకములైన పోరాటాలను ఎదుర్కొనుచున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ లోకములో ఎలా నడుచుకోవాలని ఆయన మీకు బోధిస్తాడు. అందుకే దేవుని వాక్యము ఏమని సెలవిచ్చుచున్నదో చూడండి, " దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధియెవడు '' (రోమా 8:31) అన్న వచనము ప్రకారము ఈ లోకములో మీకు విరోధముగా ఎటువంటి పోరాటాలు వచ్చినను దేవుడు మీ పక్షమున ఉన్నట్లయితే, నిశ్చయముగా మీకు విరోధులు ఎవ్వరు కూడ మీ యెదుట నిలువలేరు.

ఒకసారి, ఒక సంస్థ యొక్క వాటాదారుల్లో ఉన్న ఒక వ్యక్తిని గూర్చి పుకార్లను సృష్టించడానికి ఉద్దేశించిన ఒక గుంపు ఉండెను. వారు ఎప్పుడు అతనిని దెబ్బతీయడానికనియు మరియు గాయపరచడానికనే కనిపెట్టియుండేవారు. అంతమాత్రమే కాదు, అతని పై అధికారులు ఒక దినమున అతనికి ఇవ్వబడిన పనులను గుర్తించి, ఆతనిపై తప్పు ఆరోపణలు చేశారు. అదృష్టవశాత్తుగా, ఆ వాటాదారుడు వారి యొక్క కుతంత్రములను అనగా, చెడు పథకములను గుర్తించి, ప్రభువును ఎంతో భక్తి శ్రద్దలతో ప్రార్థించాడు. వెంటనే అతడు దేవుని యొక్క దైవీకమైన నడుపుదలను పొందుకొని మరియు దేవుని వాక్యము ద్వారా అతడు బలపరచబడెను. అతని పై అధికారులు వేయు ప్రతి ఒక్క ప్రశ్నలకు తెలివిగాను మరియు సూటిగా జవాబు ఇచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుని చేత అతను నడిపించబడ్డాడు. పై అధికారులు, అతనిని వేలుపెట్టి చూపిన తప్పుడు ఆరోపణలు ఏమియు ఇతనిలో లేవని నిర్థారించారు. వాస్తవానికి అతనిపై దోషారోపణ చేసిన వారందరు ఆ ఆధికారుల యెదుట సిగ్గుతో తలవంచుకొన్నారు.
నా ప్రియులారా, కష్టతరమైన ఆ కార్యములో ఏమి మాట్లాడవలెనో ఆ దైవభక్తి కలిగిన వ్యక్తిని దేవుడు నడిపించిన విధంగా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును కూడ నడిపిస్తాడు. నా ప్రియ సహోదరీ, సహోదరులారా, మనము మన యొక్క స్వంత తెలివి చేతగానీ, జ్ఞానము చేత గానీ, అనుభవము చేతగానీ, నైపుణ్యము చేతగానీ, దేనినైనను సాధించలేము. దేవుడు మనతో కూడ లేనట్లయితే, ఈ ప్రపంచములో ఉన్నత స్థానములో ఉంటూ, ఐశ్వర్యవంతులుగా ఉన్నను అది అంతయు వ్యర్ధమే! 

నా ప్రియులారా, నేడు మీ పరిస్థితులు ఎలాగున్నను సరే, మీరు దేవుని వైపు మాత్రము చూచినట్లయితే చాలు, ఆయన మీకు నూతన ఆలోచనలు ఇచ్చి మరియు మీ జీవితములో అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన చూపించే మార్గదర్శకత్వం ద్వారా మీరు మంచి మార్గాలలో నడుచుటకు మీకు దారిచూపుతుంది. అంతమాత్రమే కాదు, మీరు ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలని ఆయన మిమ్మును సరైన మార్గమున నడుచుకొనునట్లు మీకు బోధిస్తాడు. మీకు విరోధముగా మాట్లాడినవారిని మీ యెదుట సిగ్గుపడునట్లు చేసి, అనేకులకు మిమ్మును దీవెనకరముగా మారుస్తాడు. 
Prayer:
కృపకలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నేడు మా జీవితాన్ని నీ దివ్య హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. నీవు మమ్మును నడిపించనట్లయితే, మేము మార్గము తప్పిపోతాము. దేవా, మేము సరైన మార్గములో నడుచుటకును మరియు ఎవరితో, ఎక్కడ ఎలా మాట్లాడాలో మాకు బోధించి, మమ్మును మంచి మార్గములో నడిపించుము. మాకు విరోధముగా మాట్లాడిన వారందరు సిగ్గుపడనట్లు చేయుము. మా జీవితములో గొప్ప అద్భుత కార్యాలు జరిగించి మమ్మును అనేకులకు దీవెనకరముగా మార్చుమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000