Loading...
Evangeline Paul Dhinakaran

ఎటువంటి స్థితిలో ఉన్నను మిమ్మల్ని చూస్తున్న దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
10 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడని మరువకండి. మీరు ఎక్కడ ఉన్నను, ఏమి చేస్తున్నను, మీ కష్టాలను, మీ సమస్యలను దేవుడు చూస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఎన్నటికిని ఒంటరిగా విడిచిపెట్టడు. మీ యొద్దకు వచ్చి, మీకు సహాయము చేస్తాడు. ఆలాగుననే, దేవుడు ఎడారిలో ఒక స్త్రీని చూచి, ఆమెను ఆదరించి, సహాయమందించిన హాగరును గురించి బైబిల్‌లో చదివినట్లయితే, ' నన్ను చూచుచున్న దేవుడు ' అని హాగరు తెలియజేసెను. ఒక అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెతో మాట్లాడిన ప్రభువునకు ఈ పేరు పెట్టెను, ఆమె తన యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోతున్నప్పుడు, " మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు...అని చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను '' (ఆదికాండము 16:13). అవును, హాగరును ప్రభువు ఓదార్చి, ఆమెను ఆశీర్వదించాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు నిజంగా, ఎక్కడ ఉన్నా సరే, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ కన్నీళ్లు, బాధ మరియు అవసరాలు ఆయన దృష్టిని నుండి ఎన్నటికిని దాచబడవు. హాగరు వలె మీరు మొఱ్ఱపెట్టినట్లయితే, దేవుడు మీ కన్నీళ్లన్నింటిని తన బుడ్డిలో దాచిఉంచాడు. కాబట్టి, ఆయన మిమ్మల్ని ఓదార్చి, గొప్ప జనంగా విస్తరింపజేస్తాడు.
 
ఒక రోజు, ఒక స్కూబా డైవర్ సముద్రపు అడుగుభాగానికి వెళ్ళాడు, అక్కడ ఏదో ఒక కాగితం ముక్క చిక్కుకున్నట్లు గమనించాడు. అతడు ఆ కాగితాన్ని తీసుకున్నాడు మరియు అందులో ' నా దేవుడు నన్ను చూస్తున్నాడు ' అని ఇది పెద్ద అక్షరాలతో వ్రాయబడియున్న ఒక కరపత్రము. ఇంతకు ముందు అనేకసార్లు సువార్తను తిరస్కరించిన వ్యక్తి స్కూబా డైవర్. కానీ, అతని దైవభక్తిగల తల్లి మరియు దైవభక్తిగల ప్రజల ప్రార్థనలు అతనిపై ఎప్పుడూ ఉండేవి. అందువలన, ఈసారి అతను సముద్రం క్రింద దేవుడు యేసుక్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించుకోవాలని అతని పట్ల బాధ్యత కలిగి ఉండెను. కాబట్టి, ఆ మాటలు వ్రాయబడిన ఒక కరపత్రము అతని చేతికి అందినది. దానిని చూచిన అతడు ఇలా అన్నాడు, ' నేను ఈసారి దేవుని వాక్యాన్ని ఎదిరించలేను. ప్రభువు నన్ను సముద్రపు అడుగు భాగంలో కలుసుకున్నాడు అని చెప్పి, ' వెంటనే అతడు తన జీవితాన్ని యేసుక్రీస్తునకు సమర్పించుకున్నాడు. ఆయన సువార్తను అంగీకరించాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును! నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని పైకి లేపడానికి మీ జీవితపు అట్టడుగు దశలో కూడా దేవుడు మిమ్మల్ని కలుసుకుంటాడు. కీర్తనకారుడైన దావీదు, దేవుని సర్వశక్తిని గురించి అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు, " నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడిచేయి నన్ను పట్టుకొనును '' (కీర్తనలు 139:8-10) అన్న వచనముల ప్రకారము అతడు ఈ కీర్తన పాడటానికి కారణముగా ఉండెను. దేవునికి మీరు చేసిన ప్రార్థనలకు ఎప్పుడూ సమాధానం ఇవ్వకుండ ఉండడు. ఎటువంటి ఒత్తిడి లేదా నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని అణచివేయలేవు. సమస్యలతోను మరియు వ్యాధులతోను బాధపడుచున్న మీ పట్ల ఆయన వాగ్దానం చేయుచున్నాడు, "...యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు '' (ద్వితీయోపదేశకాండము 28:13) అన్న వచనము ప్రకారము సమస్తమును సృష్టించిన దేవుడు మీ కోసం మరియు ఆయన ఇలా అంటున్నాడు, " ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయు చున్నాను '' (యెషయా 43:19) అన్న వచనము ప్రకారము నేడు దేవుడు మీకాజ్ఞాపించుచున్న మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల, మిమ్మల్ని చూస్తున్న దేవుడు, నిశ్చయముగా, మీ పట్ల ఒక నూతన క్రియను జరిగించి, అరణ్యములో మీకు త్రోవ కలుగజేసి, హాగరు వలె మిమ్మల్ని ఓదార్చి, మిమ్మల్ని గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాడు. నేడు ఈ అద్భుతాన్ని మీరు పొందుకొని ఆనందించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

పై వచనము ప్రకారము నీవు చూచుచున్న దేవుడవని మేము విశ్వసించుచున్నాము. మేము, మా కుటుంబము నీలో ఫలించు వృక్షమువలె ఉండుటకు అట్టి కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా పిల్లలు ఈ భూమిపై ఆశీర్వదింపబడి మరియు సంపన్న స్థితిలో ఉండాలని నీవు మా పట్ల కోరుచున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. యేసయ్యా, మేము నీ రక్తం ద్వారా కొనబడ్డాము. కాబట్టి, మా జీవితంలో ఎటువంటి కొరత ఉండదని మేము విశ్వసించుచున్నాము. మా జీవితంలో ఒక కుటుంబంగా ఎక్కువ ఫలాలను ఇవ్వడానికి నీ దయను మా మీద కుమ్మరించుము. జ్ఞానం, వివేకము, అభిషేకం, ఆరోగ్యం మరియు ఐశ్వర్యవంతులనుగా మా జీవితాలను అభివృద్ధిపరచుము. అరణ్యములో హాగరును చూచిన దేవుడవు నేడు మా జీవితములో ఉన్న సమస్యలను, వ్యాధులను చూచి, మా ప్రార్థనలకు జవాబు దయచేయుము. మా సంతతిని విస్తరించునట్లు చేయుము. నీ మహిమను అనేకుల పట్ల హెచ్చించుటకు మమ్మల్ని మరియు మా సంతతిని ఈ భూమిపై ఒక సాధనంగా మార్చుము. నీ మాటలను గైకొని ఆ ప్రకారము నడుచుకొనునట్లుగాను, తోకగా కాకుండ మమ్మల్ని తలగా ఉండునట్లు సహాయము చేయుమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దయగల నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000