Loading...
Stella dhinakaran

మీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించే దేవుడు!

Sis. Stella Dhinakaran
12 Oct
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయుచున్న మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించును '' (ద్వితీయోపదేశకాండము 14:28) అన్న వచనము ప్రకారము మీరు దేవుని యందు భయభక్తులు కలిగియున్నప్పుడు దేవుడు మీకు ఈ ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. 

" యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును '' (కీర్తనలు 128:1,2) అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మన పితరుడైన అబ్రాహామును చూచినట్లయితే, అతడు దేవుని యందు ఎంతో భయభక్తులతో మరియు భక్తిగల జీవితమును జీవించుట గాక, అతని ఆ కుటుంబ సభ్యులందరు కూడ ఆయనను అనుసరించారు. కాబట్టి, అబ్రాహాము దేవుని యందు చూపిన భయభక్తులను బట్టి, " సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా '' (యెషయా 41:8) అని దేవుడు పిలిచెను. అంతమాత్రమే కాదు, అతడు దేవునిచేత బహుగా ఆశీర్వదింపబడ్డాడు. తాను ఆశీర్వదింపబడుట మాత్రమే కాదు, అతని సంతతికి ఆ దీవెనలు విస్తరించినవి. " అబ్రాహాము జీవితములో పొందిన దీవెనలు మా జీవితములో మేము పొందుకొనగలమా?'' అని తలంచుచున్నారా? అవును, మీరు కూడ అబ్రాహాము వలె మీ పూర్ణ హృదయముతో దేవునిని వెదకుచూ మరియు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, మీరు కూడ ఇటువంటి గొప్ప ఆశీర్వాదములను పొందుకొనవచ్చును. 
ఒక కార్యాలయములో ఒక యౌవనస్థుడు దేవునికి భయపడుతూ, ఎంతో కష్టపడి పనిచేసేవాడు. తనకు ఇచ్చిన పనిని ఎంతో నమ్మకముగాను, యథార్ధముగాను పూర్తిచేసేవాడు. తనకివ్వబడిన సమయములోనే తన బాధ్యతలను ఎంతో విశ్వాసనీయంగా చేసి ముగించుట ద్వారా, దేవుని దృష్టిలో నమ్మకముగా జీవించేవాడు. కానీ, ఇతని యొక్క పై అధికారి ఈ వ్యక్తి యొక్క శక్తిసామర్థ్యములను చూచి, అసూయపడేవాడు. ఈ యువకుడు ఏలాగైన నన్ను అధిగమించి ఉన్నత స్థానానికి వెళ్లతాడని తలంచాడు. కాబట్టి, ప్రతి రోజు తాను చేసిన పనికి ప్రతిగా ఎల్లప్పుడు అనవసరంగా కఠినమైన మాటలతో అతని తిట్టి అవమానించేవాడు. అయితే, చివరికి ఏమి జరిగిందో తెలుసా? దేవునికి భయపడుచూ, కష్టపడి పనిచేసే ఆ యువకుడు ప్రభువు ద్వారా ఉన్నత స్థాయికి హెచ్చించబడెను. మరియు తన మీద అసూయపడిన ఆ ఉన్నత అధికారి అతని క్రింది స్థానమునకు తగ్గించబడెను. 

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పరిస్థితి ఎలాగున ఉంది? పై చెప్పబడిన యౌవనుని వలె మీరు కూడ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుచూ, ఆయన దృష్టిలో ఆనందకరమైన జీవితాన్ని గడుపుటలో జాగ్రత్తగా ఉన్నట్లయితే, మీరు కొలతలేకుండా ఆశీర్వాదములను పొందుకుంటారు. మీ జీవితములో మేలులను అనుభవించునట్లు కృపను అనుగ్రహించి మరియు మీ ఆత్మలను కూడ దీవిస్తాడు. ప్రభువు మీ కుటుంబాన్ని మరియు మీ ఉద్యోగ స్థలమును, ఇంకను మీరు చేయు ప్రతి పనిలో ఆయన మిమ్మును దీవిస్తాడు. అబ్రాహాము జీవితమువలె మీ జీవితములో కూడ దేవుని దీవెనలు కావాలా? అయితే, నేడే ఈ సందేశము చదువుచున్న మీరు అబ్రాహాము వలె దేవుని యందు భయభక్తులు కలిగియుంటూ, విశ్వాసముతో జీవించండి, నిశ్చయముగా, దేవుడు మిమ్మును మరియు మీ సంతతిని కూడ బహుగా ఆశీర్వదిస్తాడు. 
Prayer:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, 

నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, పై చెప్పబడిన Äౌవనునివలె మేము కూడ నీ యందు భయభక్తులు కలిగి జీవించునట్లును మరియు నీ యందు నమ్మకము కలిగియుండునట్లు మాకు సహాయము చేయుము. మా జీవితములో నీకు మొదటి స్థానమును ఇచ్చుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. దేవా, మా పై అధికారులు మా పట్ల అసూయ కలిగియున్నట్లయితే, నీవు సమస్తాన్ని మార్చి, నీ యొక్క మంచితనమును మేము అనుభవించుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, అబ్రాహాము వలె మేము నీ ఆజ్ఞలకు లోబడి, దృఢమైన విశ్వాసముతో జీవించునట్లు సహాయము చేయుము. నేటి నుండి మేము చేయు ప్రతి పనిలోనూ, నీ దీవెనలతో మమ్మును నింపుము. ఎక్కడైతే, మేము ఆశీర్వదింపబడకుండా ఉన్నామో ఆ స్థలములో నీవు మాకు కొలతలేకుండా దీవెనలు కుమ్మరించి, మమ్మును ఉన్నతస్థానమునకు హెచ్చించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000