Loading...
యెహోవా అద్భుతాలు చేయును!

ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకందరికి శుభాభివందమునలు తెలియజేయుచున్నాము,

క్రీస్తునందు నా ప్రశస్తమైన సహోదరీ, సహోదరులారా మరియు ప్రియ చిన్నబిడ్డలారా!

ఈ రోజు ప్రత్యేకమైన రోజు, ఆగష్టు అను నూతన నెలను మనము ఆరంభిస్తున్నాము. అవును, దేవుడు మనకు ముందుగా నడుస్తు వెళ్లి, దిశనిర్దేశాన్ని చేస్తూ, సకల ఆశీర్వాదములను అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. " యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును '' (యెహోషువ3:5). ఇది ఒక వాగ్దాన వచనము. దేవుని సేవకుడైన యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ వాగ్దానమును తెలియజేయుచున్నాడు. ' మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఎందుకంటే, యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును.' ఇది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు అనుగ్రహింపబడిన వాగ్దానము. " దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి '' (2 కొరింథీయులకు 1:20) అను ఈ వాగ్దానము ప్రకారము ఈ నెలంతయు కూడ మనము అద్భుతకార్యములను చూడనైయున్నాము. అయితే, మనము ఏమి చేయాలంటే, మనలను మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్రపరచబడిన వ్యక్తిగా ఉండాలి, ప్రభువు మనకు సహాయము చేస్తాడు,

పవిత్రపరచుకొనుట!

దేవుడు జరిగించే అద్భుతాలను చూడాలంటే, మొదటి మెట్టు ఏదనగా, మనలను మనము పవిత్రపరచుకొనవలసి ఉన్నది. మనము దేవుని అడిగినప్పుడు, ఆయన మనలను తన పరిశుద్ధత చేత ఆశీర్వదిస్తాడు. మలాకీ 2:11 వ వచనమును మనము చదివినట్లయితే, దేవుని వాక్యము మనకు ఏమి తెలియజేస్తుందో చూడండి, " యూదా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి '' దేవుడు పరిశుద్ధతను ప్రేమించువాడు. పరిశుద్ధత లేకుండ మనము దేవునిని చూడలేము (హెబ్రీయులకు 12:14). మనము మన జీవితాలలో అద్భుతాలను మరియు ఏ ఆశీర్వాదాలను కూడ పొందుకోలేము.

బైబిల్‌లో మత్తయి సువార్త 18:14 వ వచనమును మీరు చదివినట్లయితే, ఏ వ్యక్తి కూడ నశించకూడదని దేవుని యొక్క చిత్తమై యున్నది. ' నశించి పోవడము ' అంటే, మనము చెడ్డవారము కాకుండ ఉండాలి. ఎవరు కూడ చెడు మార్గాలను అనుసరించకూడదు. అపవాది చాలా జాగ్రత్తగా మనలను గమనిస్తు ఉన్నాడు. అతడు మనలను తన దగ్గరకు ఈడ్వబడుటకు, పాపపు అలవాట్లలోనికి లాగుటకు ఆలోచన చేయుచున్నాడు. అవును 1 యోహాను 5:19 అది మనము గమనించ గలుగుతాము. లోకమంతయు దుష్టత్వము క్రింద ఉండి యున్నదని సెలవిచ్చుచున్నది. బైబిల్‌లో 1 యోహాను 2:16 వ వచనము ఏమి చెబుతుందంటే, మనము ఎక్కడ చూచినను ప్రజలు శరీరాశ చేతను, నేత్రాశ చేతను, జీవపు డాంబికత్వము చేతను నింపబడి యుంటున్నారు.

నా ప్రియులారా, ఈనాడు మనము ఎక్కడ చూచినను సరే, ప్రజలు ఈ లోకాశల చేత నింపబడియుంటున్నారు. వీటన్నిటి మధ్యలో మనము పరిశుద్ధమైన జీవితాన్ని ఏలాగున కలిగియుండ గలుగుతాము? బైబిల్‌లో గలతీయులకు 5:24వ వచనము చూచినట్లయితే, " క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసియున్నారు '' అని వ్రాయబడియున్నది. అవును, మీరు వీటన్నిటిలో నుండి బయటకు రావలసియున్నది.

ఇందునిమిత్తమే యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణమును పెట్టియున్నాడు. మీరు యేసుతో కూడ సిలువ వేసుకొనవలెను. " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు '' (గలతీయులకు 2:20) అని పౌలు వ్రాస్తున్నాడు.

ఈ దినాలలో చూచినట్లయితే, ఎల్లప్పుడు మీ జీవితాన్ని వృధా చేసుకొనుటకు మధ్యపానమును సేవిస్తున్నవారలారా, ఎప్పుడు కూడ పోట్లాడుతూ, దేవునికి దూరముగా వెళ్లుతూ, సమయమును వృథా చేసుకుంటున్న స్త్రీలారా, మీ జీవితాన్ని పరీక్షించుకోండి, సిలువవైపు చూడండి, కేవలం సిలువ మాత్రమే మీ జీవితాలను మార్చగలదు. దేవుడు మిమ్మును విమోచించుటకు శక్తిగలవాడైయున్నాడు. ఎవరైతే, పాపకరమైన కార్యాలు చేయుచూ, దేవునికి దూరముగా ఉండియున్నవారు ఎవరైన సరే, యేసు చెంతకు రండి, ఆయన మీ కోసం వేచియున్నాడు. నా కుమారుడా, కుమార్తె, ఆయన నీ కోసం సిలువలో ప్రాణమును పెట్టియున్నాడు. ప్రభువు తన ప్రేమ కనికరములతో ఎదురు చూస్తున్నాడు. ఆయన యొద్దకు రండి. ' తండ్రీ, నన్ను క్షమించు, నూతన జీవితమును నాకు అనుగ్రహించుము, నా అపరాధములన్నిటిని క్షమించండి ' అని ప్రార్థించండి. అప్పుడు ప్రభువు మీ పాపకరమైన కార్యముల నుండి, వ్యసనముల నుండి మిమ్మును విడిపించగలవాడై యున్నాడు. ఇకమీదట త్రాగుబోతుగా ఉండకండి, మాదక ద్రవ్యాల సంకెళ్ల క్రింద ఏమాత్రము ఉండిపోకండి. ఎల్లప్పుడు పోట్లాడేవారిగా ఇక ఉండకండి, దేవుని శాంతిని కలిగియుండండి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మీ హృదయాన్ని మరియు మీ జీవితాన్ని నింపుతుంది.

విజ్ఞాపనలు

రెండవదిగా, మీరు ప్రార్థనలో అడిగినప్పుడు దేవుడు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఎఫెసీయులకు 3:20వ వచనము మీకు తెలిసినదే. దేవుడు మీకు అత్యధికముగా అనుగ్రహిస్తాడు. ఈ నెలంతయు అనుదినము మీరు సమృద్ధిగా దీవించబడనైయున్నారు. యెషయా 58:11వ వచనము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. " యెహోవా నిత్యము నిన్ను నడిపించును. '' మరియు " అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఫిలిప్పీయులకు 4:7వ వచనము చెబుతుంది. కాబట్టి, మీరు అయనను అంటిపెట్టుకొనియున్నప్పుడు, ఏమి జరుగుతుంది? ప్రతిరోజు మరియు ఈ నెలంతయు మీరు శాంతిని కలిగి యుంటారు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మీరు కలిగియుంటారు. సౌలు ఇట్టి రూపాంతరతను స్వీకరించి తన జీవితములో పరిశుద్ధుడైన పౌలుగా మార్చబడియున్నాడు. ఈ సందేశము చదువుచున్న ప్రతి ఒక్కరు కూడ మీ హృదయాలను తెరవండి, దేవునికి మొఱ్ఱపెట్టండి, సిలువవైపు చూడండి, మీ పాపములన్నియు ఒప్పుకొనండి, ప్రభువు మీకు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మీ పాత అలవాట్లన్నియు మార్చివేస్తాడు. పాత అలవాట్లన్నియు మీ నుండి ఇప్పుడు దూరంగా వెళ్లిపోతాయి. పౌలు ఇలా వ్రాస్తున్నాడు, " ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు '' (గలతీయులకు 2:20). ఆలాగుననే, మీ జీవితము కూడ రూపాంతరపరచబడుతుంది. మీలో ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభువు తాకుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన మీలో ప్రతి ఒక్కరిని తన చెంతకు ఆకర్షించుకుంటున్నాడు. మీరు ఆయన బిడ్డలుగా మార్చబడుతున్నారు. అంతమాత్రమే కాదు, మీ జీవితములో ఇటువంటి ఆశీర్వాదాలు కావాలంటే, నేడే తప్పకుండ అవి మీకనుగ్రహించబడతాయి.

అతీంద్రియమైన ఆశీర్వాదములు!
మూడవదిగా, ఎటువంటి ఆశీర్వాదాలు మరియు అద్భుత కార్యములు మీరు ఆశించుచున్నారో, అవన్నియు ఈ నెల మీకు అనుగ్రహించబడును. యోహాను 11:40వ వచనములో దేవుడు మార్తతో మాట్లాడుచున్నాడు. " మార్త నీవు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదవు. '' అదేరీతిగా, అదే సర్వశక్తిగల దేవుడు నా సోదరీ, సోదరులారా, చిన్నబిడ్డలారా, మీతో మాట్లాడుచున్నాడు. మీరు నమ్మినట్లయితే, మీరు దేవుని మహిమను చూచెదరు. దేవుని మహిమ మీ మీదికి దిగివచ్చుచున్నది.

నా ప్రియులారా, నాకు బిడ్డలు లేరు అని అనుకుంటున్నారా? నాకు ఉద్యోగము లేదు, నాకు ఏమియు లేదు, అని అనుకుంటున్నారా? నన్ను ప్రేమించేవారెవరు లేరని చింతించుచున్నారా? సర్వశక్తిగల దేవుని హస్తము ద్వారా ప్రతి చిన్న, చిన్న కార్యములు కూడ మీకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. అయితే, మీరు ఆయనను అడగాలి, మన దేవుడు ప్రకృతికి అతీంద్రియమైన దేవుడు. ' తండ్రీ, మీరే నా ఏకైక నిరీక్షణ,' అని మిమ్మును మీరే ఆయన యెదుట తగ్గించుకొనండి, మీరు ఆయన ఎదుట ఎంతగా తగ్గించుకుంటారో? అంతగా హెచ్చింపబడతారు. ఈ వాక్యాన్ని నమ్మండి, ఇవి నామాటలు కాదు, ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ప్రతి ఒక్కరితోను మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయునని నమ్మునప్పుడు మీరు దీవింపబడతారు. మన దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయన మిమ్మును ఆశీర్వదించినప్పుడు, ఆయన ఆతీతమైన ఆశీర్వాదములతో మిమ్మును దీవిస్తాడు. క్రీస్తులో నూతనమైన జీవితము, సమాధానకరమైన రోజులు, ఈ నెలలో ప్రతి రోజు కూడ, ఆలాగే దేవుని యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ఆధ్యాత్మికంగాను, మీరు ఏ స్థితిలో ఉన్నను సరే, ఆ స్థితి నుండి మీరు ఇంకను పైకి ఎదుగుతారు. మీరు ఎంత గొప్ప ఆశీర్వాదాలను స్వీకరించబోతున్నారో చూడండి, నా ప్రియ సోదరీ, సోదరులారా, గొప్ప ఆశీర్వాదములను మీరు స్వీకరించనై యున్నారు. దీనిని మీరు నమ్మండి, ' ప్రభువా, నా అవిశ్వాసమును తొలగించు, పాపగత జీవితాన్ని తొలగించు, అద్భుతమైన జీవితాన్ని నాకు దయచేయుము. నీవు నాతో కూడ ఉండాలి, ప్రతిరోజున నేను నీ యొక్క సమృద్ధి ఆశీర్వాదాలను స్వీకరించగలగాలి ' అని మీ జీవితాన్ని ఆలాగున దేవునికి సమర్పించుకొని ప్రార్థించండి. నిశ్చయముగా, దేవుని దీవెనలు మీ మీదికి సమృద్ధిగా దిగివస్తాయి.

Links of July 2018 Blessing Message Video
Hindi Click here
Tamil Click here
Malayalam Click here
Telugu Click here
Kannada Click here
Assame Click here

ప్రార్థన:

మా అమూల్యమైన పరలోకమందున్న తండ్రీ,

ప్రభువా, నూతన నెల ఆగష్టును ఆరంభించియున్నాము. నీవు మమ్మును విడిపించనట్లయితే , నీవు మాతో కూడ ఉండకపోతే, నీవు మాకు నడిపింపు కలిగించకపోతే, మేము ఎన్నటికిని నీ యొక్క ఆశీర్వాదాలను పొందలేవ. తండ్రీ, నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి, మోకరించి దురలవాట్ల నుండి విడిపించుమని మొఱ్ఱపెడుతున్న వారందరిని జ్ఞాపకము చేసుకొనండి. వారి జీవితములను శుద్ధీకరించుము. ప్రభువా, వారికి నీ పరిపూర్ణతను, ఆశీర్వాదమును, సమాధానమును అనుగ్రహించుము. వారిని నూతన సృష్టిగా మార్చుము. వారు నీ యెదుట తమ హృదయమును తెరచుచున్నారు. గనుకనేవారి మొఱ్ఱలను ఆలకించుము. వారి జీవితములో గొప్ప అద్భుతములను మరియు మహత్కార్యాలను, దేవుని యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదాలను వారు చూడగలుగునట్లు వారిని పరిశుద్ధులనుగా చేయుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రీ, ఆమేన్.

మన హృదయాలలో మనము విశ్వాసము కలిగి ధ్యానము చేసియుండగా, మనము ఇప్పుడే దానిని పొందుకొనుచున్నాము. సౌలు అనబడే వ్యక్తిని దేవుడు తన సేవకునిగాను, పౌలుగాను ఏ రీతిగా మార్చియున్నాడో, అదేవిధంగా, దేవుడు మిమ్మల్ని కూడ ఈనెలంతయు మరియు రాబోవు దినములన్నియు కూడ దేవుని మహిమ ద్వారా ఆ విధంగా ప్రకాశింపజేయుచున్నాడు. మీరు దేవుని సమృద్ధికరమైన ఆశీర్వాదాలచేత, శాంతిచేత దీవించబడతారు. ఈ నెలంతయు అద్భుతములు మీరు చూడనైయున్నారు. పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించండి. దేవునికి సంతోషాన్ని కలిగించే జీవితాన్ని కలిగియుండండి. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. నేను మ కొరకు ప్రార్థించుచున్నాను, దీవెనకరమైన మాసమును ఆనందించండి!