Loading...
Dr. Paul Dhinakaran

మీరు దేవుని దృష్టికి ప్రియులును, ఘనులునైయున్నారు!

Dr. Paul Dhinakaran
12 Jun
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఈలోక ప్రజలు ఏలాగున చూచినను సరే, మీరు దేవుని దృష్టికి తన బిడ్డలుగా పిలువబడుచున్నారని మాత్రము జ్ఞాపకముంచుకొనండి. ఆయన దృష్టిలో మీరు ఒక దాచబడిన ధనమైయున్నారు. ఆయన మిమ్మల్ని అత్యధికముగా ప్రేమించుచున్నాడు. మీరు ఆయనకు ప్రియులు కావలెనని మీ పట్ల ఆయన కోరికయై యున్నది. " నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను... '' (యెషయా 43:4) అన్న వచనము ప్రకారము మిమ్మల్ని ఆయన ప్రేమించుచున్నందున, మీరు దేవుని దృష్టికి ప్రియులుగాను, ఘనులుగాను ఉన్నారు. ఆలాగైతే, ఆయన ఏలాగున మీ జీవితములో కొరతలను అనుమతించుచున్నాడు మరియు మీపై అవి అధికారమును చేయుచున్నవని తలంచుచుండవచ్చును. అయినను, ఎన్నటికిని ఆయన మిమ్మల్ని విడువడు. ఆయన అధికారము మరియు ఆలోచనలు సరియైన సమయములో మీ యొద్దకు వచ్చి, మిమ్మల్ని ఘనపరచుటకును, మీరు ఇతరులకంటె ఘనపరచబడునట్లు చేస్తాడు. 

ఒక సాధారణమైన వ్యాపారి గొప్ప నష్టమును ఎదుర్కొనుట వలన, అతనితో కూడ వ్యాపారములో పాలిభాగస్థులుగా ఉన్నవారు అతనిని విడిచిపెట్టారు. అంతేగాక, తద్వారా అతను అనారోగ్యముతో హాస్పిటల్‌లో చేర్చబడ్డాడు. హాస్పిటల్‌కు దగ్గరలోని ఆలయములో నుండి వినిపించుచున్న ఒక మధురమైన పాటను అతను విన్నాడు. అతను ఎంతో కష్టపడి, తన పడక మీద నుండి లేచి, ఆ చర్చి వద్దకు వెళ్లాడు. అక్కడ గాయకుల బృందం, " దేవుడు మిమ్మును చూచుకొనును '' (గాడ్ విల్ టేక్ క్యేర్ ఆఫ్ యు) అని పాడుచున్న పాటను వినినప్పుడు, ఆత్మ పూరితమైన ఆ మాటలు అతని హృదయమును తాకినవి. తద్వారా యేసుక్రీస్తు ప్రేమ అతని హృదయములోనికి చొచ్చుకొనిపోయి, అతనికి జీవమునిచ్చినది. అతను నూతన బలమును అనుభవించాడు. అతను పరిపూర్ణముగా స్వస్థతను పొందుకున్నాడు. అతను డాక్టర్లను పిలిచి, అతనిలో వచ్చిన నూతన బలమును గూర్చి తెలియజెప్పాడు. అప్పటి నుండి అతను తన జీవితమును దేవునికి సమర్పించుకొని, మళ్లీ తన వాప్యారమును పున:ప్రారంభము చేశాడు. అటుతరువాత అతని వ్యాపారము మెల్లమెల్లగా అభివృద్ధి పొందినది. ప్రపంచములోనే ఆ వ్యాపారము ప్రఖ్యాతి చెందినదిగా మారెను. ఆయన ఎవరో కాదు, ప్రపంచములోనే అగ్ర వ్యాపార సంస్థలలో ఒకరైన జె.సి.పెన్నీ. ఈనాడు అమెరికాలోని 49 రాష్ట్రములలో ఆయనకు 1400 డిపార్ట్‌మెంటు స్టోర్లు అతని ద్వారా స్థాపించబడినవి.
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ వ్యాపారం కూడ నష్టములో ఉన్నదా? దేవుని వాక్యము నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని అగ్ర స్థానమునకు హెచ్చించుటకు శక్తికలిగియున్నది మరియు ప్రతి ప్రదేశంలోను సమృద్ధిగా నడవడానికి మిమ్మల్ని రూపాంతరపరచును. వ్యాపారములో నష్టాలు మరియు స్నేహితులచే చేయి విడువబడిన పరిస్థితులలో ఉంటూ, మీ జీవితము ఎడారి వలె ఉన్నదని నిరుత్సాహపడుచున్నారా? కలవరపడకండి. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని దృష్టికి ప్రియులై యున్నారు. మీ ఘనత దేవుని యొద్ద నుండి వచ్చును గానీ, మనుష్యుని వద్ద నుండి రాదు. కాబట్టి, ఎన్నటికిని ఆయన మీ శ్రమలలో క్రుంగిపోనీయ్యడు. దేవుని వాక్యము మిమ్మల్ని ఎత్తైన స్థలములకు ఎక్కించుటకు శక్తిగలది. మరియు ప్రతి స్థలములోను మీరు సమృద్ధిలో నడవడానికి దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. జె.సి. పెన్నీ జీవితములో అద్భుతము జరిగించిన దేవుడు నేడు మీకు చేయడా? భయపడకండి, మీరు దేవుని యందు నమ్మిక యుంచి, ఆయన వాక్యమునందు విశ్వాసముంచినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ జీవితములను రూపాంతరపరచి, మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని మీకు మరల రెండంతల దీవెనలను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు.
Prayer:
కృపా సంపన్నుడవైన మా ప్రియ పరమ తండ్రీ, 

మేము వ్యాపారములో ఎంతగానో నష్టపోయిన స్థితిలో నీ చెంతకు వచ్చియున్నాము. ఈనాడు ఎంతో విలువైన నీ వాక్యమును మేము విశ్వసించునట్లు మా హృదయములను ఆయత్తపరచుము. మారుమనస్సులేని మా జీవితాలను నీ శక్తివంతమైన వాక్యము చేతను మరియు నీ నామము చేతను మమ్మల్ని మార్చుము. దేవా, మేము నీ దృష్టికి ప్రియులముగాను మరియు ఘనులముగా ఉండునట్లు మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుచున్నాము. ఈనాడు అందరి చేత విడువబడిన మా జీవితాలను చూచి నేడు అందరు ఆశ్చర్యపడునట్లుగా, నీ యొక్క బలమైన వాక్‌శక్తితో మమ్మును నింపుము. పైన చెప్పబడిన జె.సి.పెన్నీ జీవితమును నీ వాక్యము ద్వారా ఎంతో ఆశ్చర్యకరముగా మార్చి, అతడు పోగొట్టుకున్న వాటిని సమృద్ధిగా దయచేసి, అగ్రస్థానములో ఉంచినట్లుగానే, నేడు మేము కూడ నీ వాక్యముచేత మరల బలమును పొందుకొని, వ్యాపారములో మరల పుంజుకొని, అగ్రస్థానమునకు చేరునట్లు అటువంటి కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు అతి శేష్ట్రమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000