Loading...

క్షామకాలమందు మిమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు!

Samuel Dhinakaran
15 Apr
నా ప్రియ స్నేహితులారా, నేడు ఎడారిగా ఉన్న ఈ సందేశము చదువుచున్న మీ జీవితమును దేవుడు ఎల్లప్పుడు ఉబుకుచుండు నీటి వలె మారుస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ...నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు '' (యెషయా 58:11) అన్న వచనము ప్రకారము మీరు హృదయ పూర్వకముగా దేవుని మీలో నివసించాలని కోరినట్లయితే, ఆయన వాగ్దానము చేసినట్లుగానే, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ హృదయ కోరికలన్నిటిని మరియు మీ ప్రతి అవసరతలను తీర్చి, క్షామకాలమందున ఆయన మిమ్మును తృప్తిపరుస్తాడు. కొంతమంది ప్రజలు ఈ లోకములో ఉన్నవాటికంటెను దేవుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆలాగుననే, మనమందరము దేవుని మాత్రమే ప్రేమించాలని వాంఛకలిగియుండాలి. నేను యేసును ప్రేమించుచున్నాను, కనుకనే, నేను ఈ సందేశమును మీతో పంచుకొనుచున్నాను. ' యెహోవా మిమ్మల్ని నిత్యము నడిపించును మరియు క్షామకాలమున ఆయన తృప్తిపరచును ' అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, యేసును ప్రేమించే వారు ఈ లోకపు సంపదలను లేదా ఆనందాలను కోసం వెదకరు. కానీ, దేవుని ఆశీర్వాదములు వారిని వెదుక్కుంటూ వస్తాయి. 

కాబట్టి, నా ప్రియులారా, బైబిల్లో చూచినట్లయితే, " ఏలాగనగా తన శరీ రేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును '' (గలతీయులకు 6:8) అన్న వచనము ప్రకారము, మనము మన శరీరేచ్ఛలను నెరవేర్చుటకు ప్రయత్నించినప్పుడు, ఆ కోరికలు నెరవేరకుండా విఫలమైనప్పుడు, మనము మోసపోతాము. అందుకు ఉదాహరణ ను చూడండి, ఒక వ్యక్తి తన గాడిదను వేగవంతంగా పరుగెత్తించాలని ఒక పొడవాటి కర్రకు దాని అంచు చివరి భాగమున ఒక క్యారెట్టును కట్టి, దాని ముందుంచినప్పుడు, ఆ గాడిద ఆ క్యారెట్ ను చూచి ఎంతో సంతోషపడి, ఆశతో దానిని పట్టుకొనడానికి వేగంగా పరుగెత్తుటకు ప్రయత్నిస్తుంది. కానీ, అది దానిని పొందలేదు. ఆ క్యారెట్ దాని యెదుట నుండి తొలగించినప్పుడు, అది తన యొక్క అవివేక తనమును తలంచి సిగ్గునొందుతుంది. కొన్నిసార్లు మనము కూడ గాడిద వలె నడుచుకుంటాము. దాని గుర్తించినప్పుడు, ఎందుకు ఈ జీవితము అని చింతిస్తాము. మన యెదుట ఉన్న గొప్ప వారిని వెంబడించలేమని తెలుసుకున్నప్పుడు మనము కూడ గాడిదవలె మనల్ని ఒక వెర్రివారివలె భావించుకుంటాము. అదేవిధముగా, సాతాను క్యారెట్ రూపంలో మన కళ్ల యెదుట ప్రజలకు కోరికలను కలిగించుటకు ప్రయత్నిస్తుంది. అది మనతో ఆడుకుంటున్నప్పుడు మనలను అది ఒక బుద్ధిహీనులనుగా చేస్తుంది. మనతో ఆడుకొనుటకు మనలను ఒక సాధనముగా ఉపయోగించుకొనును. కాబట్టి, మన యెదుట ఉంచబడిన క్యారెట్ వంటి ఈలోక కోరికలను చూచి గాడిదవలె మోసపోకుండా ఎల్లప్పుడు దేవుని నడిపింపు కొరకు ఆయన వైపు చూడండి.
నా ప్రియులారా, పై చెప్పబడిన సంఘటన వలె గాడిద కళ్ల యెదుట క్యారెట్ ఉంచినట్లుగా, అపవాది మన కళ్ళ యెదుట ఈ లోక కార్యాలను ఉంచి, అది మన మనో నేత్రములకు గుడ్డితనమును కలుగజేసి, మనలను అంధకారములోనికి నడిపిస్తుంది. అయితే, యేసు మనతో ఉన్నప్పుడు, ఇవన్నియు మనలను వెంటాడలేవు. అందుకే యేసు " నేను యెహోవా మిమ్మల్ని నిత్యము నడిపిస్తాను. క్షామకాలమున తృప్తిపరచుదును '' అని అంటున్నాడు. మీ చుట్టు ఉన్నవారందరు మిమ్మును చూచి తృప్తిచెందనప్పుడు, యేసు మిమ్మల్ని అత్యధికమైన ఆశీర్వాదములతో నింపుతాడు. బైబిల్‌లో చూచినట్లయితే, రాజైన దావీదును దేవుడు అత్యధికముగా ప్రేమించాడు. అతని జీవితాంతం తన కార్యాలలో దేవుడు శ్రద్ధ వహించాలని నిరంతరము ఆయనను విశ్వసించాడు. దావీదు ఒక బలవంతుడైన గొల్యాతును చూచినప్పుడు, అతడు దేవుని నామము చేత గొల్యాతును నేల మీద పడగొట్టెను. ఒక సింహంగానీ లేక ఎలుగుబంటు గానీ, మందలో నుండి ఒక గొఱ్ఱెపిల్లను తీసుకొన్నట్లయితే, దేవుని సహాయము ద్వారా యౌవనుడైన దావీదు వాటిని చీల్చి చంపేవాడు. యౌవన వయస్సులోనే దేవుడు దావీదును అత్యధికముగా ప్రేమించుట ద్వారానే, ఒక గొఱ్ఱెల కాపరిగా ఉన్న దావీదును ఆయన ఒక గొప్ప రాజుగా మార్చెను. అవును, నా ప్రియులారా, ప్రియ యౌవనస్థులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో దేవుడు ఇదే కార్యములను జరిగించాలని కోరుచున్నాడు. కావుననే, దావీదువలె మీరు ఆయనను విశ్వసించాలని ఆయన మీకు సెలవిచ్చుచున్నాడు. మీరు ఆయన యందు నమ్మకముంచినట్లయితే, ఆయన మీకు సమస్త కార్యముల పట్ల సహాయం చేస్తాడు, మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాలలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయమును అనుగ్రహించి మరియు దేవుని యొద్ద నుండి ఘనతను పొందుకొనే ధన్యతను అనుగ్రహించి మిమ్మల్ని దావీదు వలె ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. 
Prayer:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నిన్ను ఘనపరచుచున్నాము. నేడు సాతాను మా మనో నేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసినట్లయితే, నేడు మా పాపములు నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా మా కళ్లు తెరువబడుటకు సహాయము చేయుము. గాడిద వలె మా యెదుట ఉంచబడి శరీరేచ్ఛలను చూచి, వాటిని వెంబడించకుండా, మమ్మును ప్రేమించే నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయుము. దావీదు వలె మేము నిత్యము నీలో నిలిచియుండునట్లు మాకు సహాయము చేయుము. యేసు అను నీ నామమున మేము అపవాదిని జయించుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను కలుగజేయుము. దావీదు వలె మేము నీ యందు నమ్మిక యుంచి, నిరంతరము నీ కృపను పొందుటకు మా హృదయములను తెరువుము. దీవెనలు లేని మా జీవితాలను నీ యొక్క నిత్యమైన దీవెనలతో నింపుము. ప్రభువా, నీవు నిత్యము మాకు తోడుగా ఉండి, క్షామకాలమందు మమ్మును తృప్తిపరచి సకలైశ్వర్యములతో దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000