Loading...
16 Sep
మీ మధ్యన నడిచి మీకు దేవుడుగా ఉండే యెహోవా!
Dr. Paul Dhinakaran

మీ పూర్ణ హృదయంతోను, మనస్సుతోను మరియు ఆత్మతోను దేవుని వెదకుటకు ఈ రోజు నిర్ణయించుకొన్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ మధ్య నడుస్తూ, మీకు దేవుడై యుంటాడు, అంతమాత్రమే కాదు, మీరు ఆయనకు ప్రజలై యుండునట్లు మిమ్మల్ని తన పిల్లలనుగా మారుస్తాడు.

Read More
15 Sep
యేసు మీ మధ్యలో యుగయుగములు సజీవుడుగా జీవిస్తాడు!
Bro. D.G.S Dhinakaran

పునరుత్థానుడై క్రీస్తును హత్తుకొని జీవించండి, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మిమ్మును నూతనపరచి ధన్యకరమైన దినాలను, సమస్త మేలులను మీకిచ్చి మిమ్మును పునరుద్ధరిస్తాడు.

Read More
14 Sep
మీ భయంను తొలగించి మీకు తోడుగా ఉండే దేవుడు!
Sis. Stella Dhinakaran

యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మీ జీవితంలో అసంఖ్యాకమైన కష్టాలు ఎదురుకావచ్చు. తద్వారా భయం మిమ్మల్ని ఆవరించి యున్నప్పటికిని వాటి మధ్యలో ఆయన పట్ల మీరు విశ్వాసంతో వుంటే ఆయన మీతో కూడ వుండి అద్భుతరీతిగా మిమ్మల్ని నడిపిస్తాడు.

Read More
13 Sep
ఎత్తయిన స్థలములలో మిమ్మల్ని నిలిపే దేవుడు!
Samuel Dhinakaran

లక్ష్యాలు మరియు ప్రణాళికలు మనము కలిగియుండడం మంచిది. కానీ, అవి సఫలము కావాలంటే, ఎల్లప్పుడూ దేవునికి ప్రాధాన్యతను ఇస్తూ, మిమ్మల్ని మీరు అర్పించుకోండి మరియు దేవునికి మొదటి స్థానమునిచ్చి, మనం మన మార్గాలను ప్రభువునకు అప్పగించినప్పుడు మాత్రమే మనం వాటిని సాధించగలము.

Read More
12 Sep
దేవుడు తన బిడ్డలకు సమృద్ధి జీవమును కలుగజేస్తాడు!
Sis. Evangeline Paul Dhinakaran

ఈనాడు మీ జీవితములో ఏదైతే మృతమైనదిగా ఉన్నదో, లేక మీ జీవితము చివరి దశకు వచ్చియుండవచ్చునని చింతించవచ్చును, అయితే, దేవుని వాగ్దానాలను మీరు గట్టిగా పట్టుకొని పట్టుదలతో ప్రార్థించినట్లయితే, యేసే జీవమునకు ధాత! గనుక, ఆయన తన యొక్క సమృద్ధి జీవముతో మరల మిమ్మల్ని పునరుజ్జీవింపజేస్తాడు.

Read More
11 Sep
దేవుడు తన చేతి నీడలో మిమ్మల్ని కప్పియున్నాడు!
Dr. Paul Dhinakaran

నిజంగా, మిమ్మల్ని ఒక అధికారం గల వ్యక్తిగా మార్చడానికి దేవుడు తన శక్తివంతమైన పిలుపును మీకు ఇచ్చియున్నాడు. కాబట్టి దిగులుపడకండి, ధైర్యముగా ఉండండి. మీరు తల్లిగర్భములో రూపింపబడక మునుపే ఆయన మిమ్మల్ని ఎరిగియున్నాడు. ఆయన మీ పట్ల జాగ్రత్త వహించి, మీ నోట తన మాటలను ఉంచి, తన చేతి నీడలో మిమ్మల్ని కప్పియున్నాడు.

Read More
10 Sep
మిమ్మల్ని అత్యధికంగా వృద్ధిపొందింపజేసే దేవుడు!
Sis. Stella Dhinakaran

సంతానం లేని దంపతులు, గర్భం దాల్చలేమని నిరాశపడే స్త్రీలు, గర్భం దాల్చినా, ప్రసవించలేని స్త్రీలు జీవితం పట్ల ఆశను కోల్పోయినవారు అబ్రాహామువలె అచంచలమైన విశ్వాసంతో దేవుని వైపు చూసి వేడుకుంటే తప్పక ఆశీర్వదించబడతారు. మీరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అన్నివేళలా ఆయనకు ప్రార్థిస్తే దేవుడు మిమ్ముల్ని తప్పక విశ్వాసంలో బలపరచి, కష్టకాలంలో జ్ఞాపకం చేసుకొని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు.

Read More
09 Sep
మీరు దేవుని నమ్మి భక్తి జీవితాన్ని కొనసాగించండి!
Sis. Stella Dhinakaran

దేవుని నమ్మి, ఆయన భక్తిలో కొనసాగే జీవితమే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి, నేడు మీరు దేవుని నమ్మి భక్తి జీవితాన్ని కొనసాగించినట్లయితే, మీ భక్తి జీవితాన్ని చూచిన దేవుడు, మీ ఎడారి జీవితాన్ని తోటలాగా మారుస్తాడు.

Read More
08 Sep
యేసు నీడవలె మీతో కూడ ఎల్లప్పుడు ఉన్నాడు!
Dr. Paul Dhinakaran

దేవుడు యుగసమాప్తివరకు మీకు తోడుగా వుంటాడు, మిమ్మల్ని ప్రేమించే వారెవరున్నారని వెదకకండి, మీరు దేవుని వైపు చూడండి, ఆయన మిమ్మును సదాకాలము విడువకుండ, మీకు సర్వాన్ని దయచేస్తాడు.

Read More
07 Sep
మీరు దేవుని యందు నమ్మకంగా ఉండి దీవెనలు పొందండి!
Bro. D.G.S Dhinakaran

ఈనాటి నుండి మీరు దేవుని యందు నమ్మకము కలిగి జీవించినట్లయితే, ఆయన యొద్ద ఉన్న మెండైన దీవెనలు మీపై కుమ్మరించి అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా ఆయన మిమ్మల్ని కూడ అత్యధికముగా ఆశీర్వదిస్తాడు.

Read More